UTI Home Remedies | మూత్రాశయ ఇన్ఫెక్షన్లు అనేవి సహజంగానే చాలా మందికి వస్తుంటాయి. మూత్ర విసర్జన చేసే విధానం వల్ల ఇవి ఎక్కువగా వస్తుంటాయి. కొందరు పురుషులు కింద కూర్చుని మూత్ర విసర్జన చేస్తుంటారు. అందువల్ల అలాంటి వారికి మూత్రాశయ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక స్త్రీలు సహజంగానే కింద కూర్చుని మూత్ర విసర్జన చేస్తారు కనుక వారిలో ఈ రిస్క్ మరీ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారు తరచూ ఈ తరహా ఇన్ఫెక్షన్ల బారిన పడుతుంటారు. మూత్రాశయ ఇన్ఫెక్షన్ పెద్ద ప్రమాదమేమీ కాదు. కానీ నిర్లక్ష్యం చేస్తే ఇది దీర్ఘకాలిక వ్యాధులకు దారి తీస్తుంది. కొన్ని సందర్భాల్లో క్యాన్సర్ వచ్చే చాన్స్ కూడా ఉంటుంది. తరచూ అపరిశుభ్రంగా ఉండే చోట మూత్ర విసర్జన చేస్తున్నా కూడా మూత్రాశయ ఇన్ఫెక్షన్లు వచ్చే చాన్స్ అధికంగా ఉంటుంది. పురుషులు కూడా ఈ ఇన్ఫెక్షన్ బారిన పడుతుంటారు. అయితే ఇందుకు డాక్టర్లు ఇచ్చే మందులను వాడడంతోపాటు పలు ఇంటి చిట్కాలను కూడా పాటించాలి. దీంతో సమస్య నుంచి త్వరగా బయట పడవచ్చు.
మూత్రాశయ ఇన్ఫెక్షన్నే యూటీఐ అంటారు. అంటే.. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అని అర్థం వస్తుంది. ఈ సమస్య ఉన్నవారికి తరచూ మూత్ర విసర్జన చేయాలనిపిస్తుంది. మూత్ర విసర్జన చేసే సమయంలో కొందరికి నొప్పి, మంట కూడా ఉంటాయి. ఈ సమస్య నుంచి బయట పడేందుకు హాట్ లేదా కోల్డ్ ప్యాక్ లు పనిచేస్తాయి. ఈ ప్యాక్‌లను మూత్రాశయం ఉన్నచోట కనీసం 15 నుంచి 20 నిమిషాల పాటు కాపడంలా పెట్టాలి. దీంతో సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. మూత్రాశయ ఇన్ఫెక్షన్ సమస్య ఉన్నవారు క్రాన్ బెర్రీ పండ్లను తింటుండాలి. లేదా ఈ పండ్లతో తయారు చేసిన జ్యూస్‌ను అయినా తాగుతుండాలి. మూత్రాశయ ఇన్ఫెక్షన్ను సహజసిద్ధంగా తగ్గించేందుకు క్రాన్ బెర్రీ పండ్ల జ్యూస్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ పండ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మూత్రాశయ ఇన్ఫెక్షన్కు కారణం అయ్యే బ్యాక్టీరియాను నాశనం చేస్తాయి. దీంతో సమస్య త్వరగా తగ్గుతుంది.
విటమిన్ సి అధికంగా ఉండే పండ్లను తింటున్నా కూడా మూత్రాశయ ఇన్ఫెక్షన్ సమస్య నుంచి బయట పడవచ్చు. విటమిన్ సి పండ్లలో ఉండే ఆమ్లాలు ఇన్ఫెక్షన్కు కారణం అయ్యే బ్యాక్టీరియాను నాశనం చేస్తాయి. దీంతో ఇన్ఫెక్షన్ నుంచి ఉపశమనం లభిస్తుంది. విటమిన్ సి ఎక్కువగా కివి పండ్లు, నారింజ, నిమ్మ, పైనాపిల్, ద్రాక్ష పండ్లలో ఉంటుంది. వీటిని ఆహారంలో భాగం చేసుకుంటే మూత్రాశయ ఇన్ఫెక్షన్ ఉండదు. మూత్ర విసర్జన చేసే సమయంలో మంటగా ఉన్నవారు ఒక గ్లాస్ నీటిలో కొద్దిగా బేకింగ్ సోడా వేసి బాగా కలిపి తాగుతుండాలి. మూత్రంలో ఆమ్లత్వం ఉంటే మూత్ర విసర్జన చేసే సమయంలో మంట వస్తుంది. ఆమ్లత్వాన్ని తగ్గించేందుకు బేకింగ్ సోడా పనిచేస్తుంది. దీంతో మూత్రంలో మంటను తగ్గించుకోవచ్చు. మూత్రం సాఫీగా జారీ అవుతుంది. మూత్రాశయ ఇన్ఫెక్షన్ తగ్గుతుంది.
మూత్రాశయం ఆరోగ్యంగా ఉండేందుకు, మూత్రాశయ ఇన్ఫెక్షన్ తగ్గేందుకు యాపిల్ సైడర్ వెనిగర్ ఎంతగానో పనిచేస్తుంది. ఇందులో ఉండే ఆమ్లాలు బ్యాక్టీరియాను నాశనం చేస్తాయి. దీంతో మూత్రాశయ ఇన్ఫెక్షన్ తగ్గిపోతుంది. రోజుకు 2 సార్లు ఒక గ్లాస్ నీటిలో అర టీస్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్ కలిపి తాగుతుంటే సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. మూత్రాశయ ఇన్ఫెక్షన్ను తగ్గించడంలో త్రిఫల చూర్ణం కూడా పనిచేస్తుంది. రాత్రిపూట ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో అర టీస్పూన్ త్రిఫల చూర్ణం కలిపి తాగుతుంటే మూత్రాశయ ఇన్ఫెక్షన్ తగ్గుతుంది. ఈ మిశ్రమం మలబద్దకానికి కూడా చక్కని ఔషధంగా పనిచేస్తుంది. ఇలా పలు రకాల ఇంటి చిట్కాలను పాటించడం వల్ల మూత్రాశయ ఇన్ఫెక్షన్ సమస్య నుంచి బయట పడవచ్చు.