Belly Fat : అమెరికన్ ఇన్ఫ్లుయన్సర్, 64 ఏండ్ల వయసులోనూ యవ్వనంగా కనిపించే హరా బ్రౌన్ తన డైట్ సీక్రెట్స్ వెల్లడించారు. సింపుల్ డైట్ నిబంధనలు పాటించడంతో ఎవరైనా ఏ వయసువారైనా అందంగా, ఫిట్‌గా, ఆత్మవిశ్వాసంతో కనిపిస్తారని మహిళల వెల్నెస్ మెంటార్ హరా బ్రౌన్ చెప్పారు. నిర్ధిష్ట ఆహార పదార్ధాలు తీసుకోవడంతో ద్వారా తాను మోనోపాజ్ అనంతరం శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించి ఫిట్‌గా, సన్నగా తయారయ్యానని ఆమె చెప్పుకొచ్చారు. మహిళల్లో మోనోపాజ్ దశలో కొవ్వు పెరిగి లావుగా తయారవుతారని ఇది వారి ఆత్మవిశ్వాసంపై ప్రభావం చూపుతుందని చెప్పారు. అయితే సరైన ఆహార పదార్ధాలను ఎంపిక చేసుకోవడం ద్వారా నాజూకుగా, ఫిట్‌గా తయారుకావచ్చని అన్నారు.
తాను 90/10 నిబంధన అనుసరిస్తానని, ఈ ప్లాన్‌లో భాగంగా తాను 90 శాతం ఇంట్లో తయారుచేసిన పోషకాలతో కూడిన ఆహార పదార్ధాలు తీసుకుంటానని, ఇక 10 శాతం ఫుడ్స్‌ను సరదాగా బయటకు వెళ్లినప్పుడు తీసుకుంటానని తెలిపారు. 90 శాతం క్యాటగిరీలో తాను యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే బ్లూబెర్రీస్, తాజా రాస్బెర్రీస్ తీసుకుంటానని చెప్పారు. ఆమె తన ఆహారంలో ఆలివ్ ఆయిల్‌ను తరచూ తీసుకుంటారు. ఇందులో ఉండే ఆరోగ్యకర కొవ్వులతో గుండె ఆరోగ్యం మెరుగవడంతో పాటు దీర్ఘాయువు సొంతమవుతుంది. చాలా వ్యాధులు పోషకాహార లేమి, అనారోగ్యకర జీవనశైలి, అలవాట్ల కారణంగా ముంచుకొస్తాయని ఓ ఇన్స్టాగ్రాం వీడియోలో బ్రౌన్ తెలిపారు.
బ్రౌన్ ఇంకా బాదం పాలు, పిస్తాలు, వేరుశనగ వంటివి తన ఆహారంలో ఉండేలా చూసుకుంటారు. ఈ ఆహార పదార్ధాల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ పదార్ధాలు ఉండటంతో ఇవి వయసుమీరే ప్రక్రియను జాప్యం చేస్తాయి. ప్రొటీన్ అధికంగా ఉండే చేపలను తరచూ తీసుకుంటారు. ఈ ఆహారంతో అకాల మరణం ముప్పు తగ్గడంతో పాటు మనం దేహాకృతి మెరుగ్గా ఉంటుందని బ్రౌన్ చెప్పుకొచ్చారు. ఇక బ్రౌన్ రోజువారీ ఆహారంలో కీర దోస, పాల కూర, గ్రీన్ క్యాబేజ్, ఫైబర్ అధికంగా ఉండే కూరగాయలు ఉంటాయి. వీటితో పాటు పెరుగు, జున్ను, నిమ్మకాయ, బీఫ్ రోస్ట్లను ఆమె ఇష్టపడతారు. రిఫైన్డ్ షుగర్స్, కార్బోహైడ్రేట్లతో కూడిన ఆహారపదార్ధాలను ఆమె తీసుకోరు. కుకీస్, కేక్స్, స్నాక్స్, ఐస్‌క్రీంకు కూడా ఆమె దూరం. ఈ ఆహర నియమాలను కఠినంగా అనుసరించడంతోనే తాను పొట్టలో కొవ్వును కరిగించి సన్నగా, దృఢంగా తయారయ్యానని బ్రౌన్ వివరించారు.
Read More :
Actor Ajith | స్నేహితుల కోసం బిర్యానీ వండిన అజిత్.. ఫొటోలు వైరల్