ఎండల చురుకు పెరిగింది. ఉక్కపోత అధికమైంది.నాలుక పిడచకట్టుకుని పోతున్నది. బయటికి వెళ్లాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి. ఇవన్నీ వేసవి లక్షణాలు! పరోక్ష మైన హెచ్చరికలు కూడా. పెద్దల వరకూ ఫర్వాలేదు.చిన్నారులు ఎండ తీవ్రతను తట్టుకోలేరు. దెబ్బకు డీ హైడ్రేషన్‌కు గురవుతారు. వడదెబ్బకు అల్లాడిపోతారు. రకరకాల ఇన్ఫెక్షన్లు దాడి చేసే ప్రమాదమూ ఉంది. తస్మాత్.. జాగ్రత్త!
వైరల్ ఇన్ఫెక్షన్లు అనగానే వర్ష కాలంలోనో, శీత కాలంలోనే దాడిచేస్తాయని అనుకుంటారు. ఇది అపోహ మాత్రమే. వేసవిలో కూడా చిన్నారులు ఇన్ఫెక్షన్ల బారినపడే ప్రమాదం ఉంది. వీటితోపాటు ఫుడ్ పాయిజనింగ్, స్విమ్మింగ్ ఇన్ఫెక్షన్స్, చర్మం పొడిబారిపోవడం, దద్దుర్లు, వడదెబ్బ తదితర సమస్యలు ఇబ్బంది పెడతాయి. కొన్నిసార్లు ఇవి ప్రాణాంతకంగా మారే ప్రమాదమూ లేకపోలేదు. కాబట్టి, తగిన జాగ్రత్తలు తప్పనిసరి.
హ్యాండ్ ఫుట్ మౌత్ డిసీజ్
అధిక వేడిమి వల్ల పిల్లల్లో ఈ వ్యాధి వస్తుంది. తీవ్ర జ్వరం, నోటి వద్ద పొక్కులు, చేతిపై దద్దుర్లు.. ప్రధానమైన లక్షణాలు.
చికిత్స
పై లక్షణాలు కనిపించగానే వైద్యులను సంప్రదించాలి. పిల్లలను సాధ్యమైనంత వరకు చల్లటి ప్రదేశంలో ఉంచాలి. పండ్లరసాల కంటే.. కొబ్బరినీళ్లు, మజ్జిగ వంటివి ఉత్తమం. కూల్‌డ్రింక్స్ అస్సలు ఇవ్వకూడదు.
ఆటైటిస్ ఎక్స్‌టర్నా
సాధారణంగా వేసవిలో పిల్లలు ఈత కొలనులకు వెళ్లడానికి ఇష్టపడతారు. ఆ సమయంలో చెవిలో నీరు చేరడం వల్ల బ్యాక్టీరియా వృద్ధిచెందుతుంది. దీని వల్ల చెవి ఇన్ఫెక్షన్కు గురవుతుంది. దీన్నే స్విమ్మర్స్ ఇయర్ లేదా ఆటైటిస్ ఎక్స్‌టర్నా అంటారు. నీరు నోట్లోకి పోవడం వల్ల గొంతు ఇన్ఫెక్షన్ రావచ్చు.
లక్షణాలు
చికిత్స
ఈత కారణంగా పిల్లల్లో చెవినొప్పి, వినికిడి సమస్య వచ్చినట్టయితే.. వైద్యులను సంప్రదించాలి. పరీక్షల తర్వాత నిపుణులు ఇయర్ డ్రాప్స్ లాంటివి సిఫారసు చేస్తారు.
ఎకో అండ్ ఎంటిరో వైరస్
సాధారణ వైరస్ల తీవ్రత పెరిగితే.. ఎకో అండ్ ఎంటిరో వైరస్ల దాడి మొదలవుతుంది. ఈ ఇన్ఫెక్షన్లు పైకి సాధారణంగా కనిపించినా కొన్నిసార్లు మెదడు, గుండె వంటి ప్రధాన అవయవాలపై ప్రభావం చూపుతాయి. దీంతో పరిస్థితి ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉంది. ముఖ్యంగా ‘ఎన్సెఫలైటిస్’ అనే ఇన్ఫెక్షన్ మెదడుపై ప్రభావం చూపుతుంది. ‘మయోకాైర్డెటిస్’ వైరస్ పిల్లల గుండెనూ దెబ్బ తీస్తుంది. దీనివల్ల తీవ్ర పరిణామాలు ఎదురవుతాయి.
లక్షణాలు
చికిత్స
పిల్లల్లో జ్వరం, తలనొప్పి వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా నిపుణులను సంప్రదించాలి. వాంతులు, విరేచనాలు అవుతుంటే డీహైడ్రేషన్ బారినపడకుండా కొబ్బరినీళ్లు, మజ్జిగ, ఓఆర్ఎస్ వంటివి తరచూ ఇస్తూ ఉండాలి. తీవ్ర జ్వరం ఉన్నప్పుడు తడిగుడ్డతో స్పాంజింగ్ చేయాలి. వైద్యుల సూచన మేరకు మందులు వాడాలి.
వడదెబ్బ
వేసవి సెలవుల్లో పిల్లలు ఇండ్లలోనే ఉంటారు. పెద్దలు ఎంత వారించినా ఎండలో ఆడుకుంటారు. ఫలితంగా వడదెబ్బకు గురవుతుంటారు.
లక్షణాలు
చికిత్స
వడదెబ్బ బారిన పడిన పిల్లలు డీహైడ్రేషన్‌కు గురికాకుండా కొబ్బరినీళ్లు, మజ్జిగ వంటి ద్రవ పదార్థాలు ఎక్కువగా ఇవ్వాలి. తరచూ మంచినీళ్లు తాగించాలి. చల్లటి ప్రదేశంలో పడక ఏర్పాటు చేయాలి. వెంటనే వైద్యులను సంప్రదించాలి.
ఫుడ్ పాయిజనింగ్
వేసవిలో ఫుడ్ పాయిజనింగ్‌కు ఆస్కారం అధికం. వేడి వాతావరణంలో బ్యాక్టీరియా వేగంగా పెరుగుతుంది. సరిగ్గా వండని ఆహార పదార్థాలలో విష క్రిములు పేరుకుపోతాయి. బాగా ఉడకని మాంసా హారంలో హానికారక బ్యాక్టీరియా తిష్ఠవేస్తుంది. దీంతో పిల్లలు ఫుడ్ పాయిజనింగ్‌కు గురవుతారు. అపరిశుభ్రమైన పండ్ల రసాలు, రసాయనాలు కలిసిన ఐస్‌క్రీమ్‌లు, నాణ్యత కరువైన శీతల పానీయాలు విషతుల్యంగా మారే ప్రమాదం ఉంది. దీనివల్ల వాంతులు, విరేచనాలు అవుతాయి. నిర్లక్ష్యం చేస్తే డీహైడ్రేషన్‌కు దారితీస్తుంది. దీనివల్ల పరిస్థితి విషమించే ప్రమాదం ఉంది. పిల్లలు అస్వస్థతకు గురైనప్పుడు, వెంటనే వైద్యులను సంప్రదించాలి.
ఇవీ జాగ్రత్తలు
-మహేశ్వర్‌రావు బండారి
డాక్టర్ అనుపమ ఎర్ర
కన్సల్టెంట్ పిడియాట్రిక్
ఇంటెన్సివిస్ట్
రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్స్ హైదరాబాద్