Health Tips | ఫేస్ యోగాతో మెరవండిలా..!
శారీరక, మానసిక ఆరోగ్యంపై యోగ సానుకూల ప్రభావం చూపుతుంది. సెలూన్లు, డెర్మటాలజిస్టులతో అవసరం లేకుండా ఫేస్ యోగతో తీరైన ముఖాకృతిని సొంతం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
న్యూఢిల్లీ : శారీరక, మానసిక ఆరోగ్యంపై యోగ సానుకూల ప్రభావం చూపుతుంది. సెలూన్లు, డెర్మటాలజిస్టులతో అవసరం లేకుండా ఫేస్ యోగతో తీరైన ముఖాకృతిని సొంతం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ముఖ కండరాల కదలికతో కాంతులీనే చర్మం కోసం అవసరమైన కొలాజెన్ ఉత్పత్తి అవుతుంది. మనం మాట్లాడేప్పుడు, నవ్వుతున్న సమయంలో, ఆహారం తీసుకునే వేళ ముఖ కండరాలను రోజూ కదిలించినా ఫేస్ యోగతో ముఖ కండరాలు క్రమంగా బలోపేతం కావడంతో పాటు రిలాక్స్ అవుతాయి.
ఇక ఫేస్ యోగతో ముఖంలో అలసట మటుమాయమై ఒత్తిడిని దూరం చేయవచ్చు. ఫేషియల్ ఎక్సర్సైజ్లు శరీరానికి, నాడీమండలం రిలాక్స్ కావడంతో మానసిక ఆరోగ్యానికి ఉపకరిస్తాయి. ముఖ కండరాలూ రిలాక్స్ అవుతాయి. వయసు మీద పడేకొద్దీ సహజ కొలాజెన్ లెవెల్స్ తగ్గుతుండటంతో చర్మం సాగిపోవడం, తేమను కోల్పోవడంతో పాటు ముడతలు వస్తుంటాయి.
ఫేస్ యోగ ద్వారా కొలాజెన్ లెవెల్స్ మెరుగ్గా ఉండటంతో చర్మం కాంతివంతంగా ఉంటుంది. ముడతలు తొలగి ముఖం స్మూత్‌గా యవ్వన మెరుపులతో కూడి ఉంటుంది. ఫేస్ యోగ సెల్ ఆక్సిజెనరేషన్, మైక్రోసర్క్యులేషన్ను మెరుగుపరచడంతో చర్మం సహజంగా నిగారింపు సంతరించుకుంటుంది.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

