పైగా వాటిని విడిచి మనం ఒక్కరోజు కూడా ఉండలేం. మరి మనకు దగ్గరైన అంత డేంజరస్ వస్తువులు ఏంటని ఆలోచిస్తున్నారా? ఆ వస్తువులేంటో ఇప్పుడు చూద్దాం..
టాయిలెట్ పేరు చెప్పగానే చాలామంది అసహ్యించుకుంటున్నారు. ఈ భూమ్మీద టాయిలెట్ సీటుపై ఉన్నన్ని క్రిములు ఇంకా ఎక్కడా ఉండవన్నట్లు ఫీలైపోతుంటారు. కానీ ఎక్కడో కాదు.. మనం రెగ్యులర్గా వాడే కొన్ని వస్తువులపై వాటికంటే ఎక్కువ బ్యాక్టీరియా ఉంటుంది.
పొద్దున లేచింది మొదలు రాత్రి పడుకునే దాకా మన చేతుల్లో తచ్చాడేది మొబైల్ ఫోనే. కానీ అది ఎంతవరకు సురక్షితమైందని ఎప్పుడైనా ఆలోచించారా? టాయిలెట్ సీటు కంటే కూడా స్మార్ట్‌ఫోన్‌పై 10 రెట్లు ఎక్కువ బ్యాక్టీరియా దాగి ఉంటుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.
అందుకే ఎప్పటికప్పుడు మన స్మార్ట్‌ఫోన్‌ను శానిటైజ్ చేసుకోవడం చాలా అవసరం. సబ్సు నీటిలో ముంచిన బట్ట లేదా యాంటీ బ్యాక్టీరియల్ వైప్తో మొబైల్ను శుభ్రపరచుకోవాలి.
మన మొబైల్ తర్వాత కీబోర్డ్పైనే అత్యధికంగా బ్యాక్టీరియా ఉంటుంది. కీ బోర్డు మీద ఒక చదరపు అంగుళానికి 3 వేలకు పైగా బ్యాక్టీరియా ఉంటుందని ఆరిజోనా యూనివర్సిటీ అధ్యయనంలో వెల్లడైంది. అందుకే కంప్యూటర్ కీబోర్డ్‌ను ఎప్పటికప్పుడు వాక్యూమ్ క్లీనర్‌తో శుభ్రం చేసుకోవాలి.
కంప్యూటర్ కీబోర్డును ఎంతగా వాడతామో.. మౌస్ను కూడా అంతే రేంజ్లో వాడతాం. కాబట్టి దానిపై కూడా కీబోర్డుపై ఉన్నట్లుగా క్రిములు ఎక్కువగా ఉంటాయి. మౌస్ మీద ఒక్క చదరపు అంగుళంలో 1500 బ్యాక్టీరియా ఉంటుందని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా అధ్యయనంలో వెల్లడైంది. కాబట్టి ఎప్పటికప్పుడు మౌస్‌ను శుభ్రపరచుకోవడం అవసరం.
స్మార్ట్‌ఫోన్ తర్వాత ఎక్కువగా మన చేతిలో ఉండే వస్తువు ఏదంటే అది రిమోట్అనే చెప్పాలి. అంత ఎక్కువ సేపు మన చేతుల్లో ఉంటుంది కాబట్టి రిమోట్‌పై బ్యాక్టీరియా కూడా ఎక్కువగానే చేరే అవకాశం ఉంది. రిమోట్ మీద ఒక్క చదరపు అంగుళంలో 200కిపైగా బ్యాక్టీరియా ఉంటుందని యూనివర్సిటీ ఆఫ్ హోస్టన్ అధ్యయనంలో వెల్లడైంది.
వాష్ రూమ్‌ను అందరూ ఉపయోగిస్తారు. రోజులో ఒక్కొకరు ఒకటి కంటే ఎక్కువసార్లు వాష్ రూమ్‌ను వాడుతుంటారు. అలా ఉపయోగించిన ప్రతిసారి వాష్రూమ్ డోర్ హ్యాండిల్ను తాకుతుంటారు. దీనివల్ల హ్యాండిల్స్‌పై క్రిములు చేరే అవకాశం అధికంగా ఉంది.
వాష్రూమ్‌కి వెళ్లినప్పుడు చేతులను సబ్బుతో శుభ్రం చేసుకోకుండానే నల్లాలను వాడుతాం. కాబట్టి వాటిపై కూడా అధిక సంఖ్యలో క్రిములు చేరతాయి. అందుకే చేతులు కడుక్కునే సమయంలో నల్లాలపై కూడా కాసింత హ్యాండ్వాష్ లిక్విడ్ లేదా డిటర్జెంట్ వాటర్ చల్లి శుభ్రం చేసుకోవడం మంచిది.
ఒక రోజులో చేతులతో ఎక్కువగా తాకే వస్తువుల్లో రిఫ్రిజిరేటర్ కూడా ఒకటి. దాన్ని ఓపెన్ చేసేందుకు తరచూ డోర్‌ను తాకుతుంటాం. దీంతో రిఫ్రిజిరేటర్ డోర్‌పై ఎక్కువగా క్రిములు చేరే అవకాశం ఉంది. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా పరిశోధకుల అధ్యయనం ప్రకారం.. రిఫ్రిజిరేటర్ డోర్‌పై ఒక అంగుళానికి 500కి పైగా బ్యాక్టీరియా ఉంటుందని వెల్లడైంది. అంటే అది ఎంత హానికరమో ఒకసారి అర్థం చేసుకోండి