World Brain Day: మెదడు ఆరోగ్యం కోసం వీటిని తినాల్సిందేనట!!
మన శరీరంలోని అత్యంత కీలకమైన అవయవాల్లో మెదడు ఒకటి. మెదడు ఆరోగ్యంగా ఉండాలంటే చాలా పోషకాహారం అవసరం. మరి ప్రపంచ మెదడు దినోత్సవం సందర్భంగా ఆ ఉత్తమమైన ఆహారాలేంటో తెలుసుకుందాం. మనం తినే ఆహారం.. మన శరీర నిర్మాణం, మన అవయవాల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా మెదడు విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. మెదడు చురుగ్గా పనిచేయాలంటే కొన్నిరకాల ఆహార పదార్థాలు తప్పక తినాల్సిందే. ఇలాంటి ఆహారాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మెదడు దీర్ఘకాలిక, స్వల్పకాలిక విధులు రెండింటికీ ఉపయోగపడుతుంది.
మన శరీరంలోని అత్యంత కీలకమైన అవయవాల్లో మెదడు ఒకటి. మెదడు ఆరోగ్యంగా ఉండాలంటే చాలా పోషకాహారం అవసరం. మరి ప్రపంచ మెదడు దినోత్సవం సందర్భంగా ఆ ఉత్తమమైన ఆహారాలేంటో తెలుసుకుందాం. మనం తినే ఆహారం.. మన శరీర నిర్మాణం, మన అవయవాల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా మెదడు విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. మెదడు చురుగ్గా పనిచేయాలంటే కొన్నిరకాల ఆహార పదార్థాలు తప్పక తినాల్సిందే. ఇలాంటి ఆహారాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మెదడు దీర్ఘకాలిక, స్వల్పకాలిక విధులు రెండింటికీ ఉపయోగపడుతుంది.
1. ఫ్యాటీ ఫిష్..
సాల్మన్, మాకేరెల్, ట్యూనాలాంటి చేపల్లో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలకు గొప్ప మూలం. ఇవి మెదడుతో సహా శరీరంలోని ప్రతి కణాన్ని నిర్మించడంలో సహాయపడతాయి. ఒమేగా-3 మెదడు కణాల పనితీరును మెరుగుపరుస్తుంది. వాటిని బలంగా చేస్తుంది.
2. గింజలు, విత్తనాలు..
విటమిన్లు, ప్రోటీన్లు, యాంటీఆక్సిడెంట్లలాంటి అత్యంత ముఖ్యమైన పోషకాల శక్తితో నిండిన నట్స్, విత్తనాలు మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు ఉత్తమమైన ఆహారం. బాదం, వాల్ నట్స్, పొద్దుతిరుగుడు గింజలు, హాజెల్ నట్స్ మొదలైనవి మెదడు కణాలను ఆక్సీకరణ ఒత్తిడి నుంచి రక్షిస్తాయి. ఇవి మెదడు అభిజ్ఞా పనితీరును మెరుగుపరుస్తాయి. తద్వారా అల్జీమర్స్, పార్కిన్సన్స్లాంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
3. బ్రొకోలీ..
బ్రొకొలీ అనేది విటమిన్లు, ఫ్లేవనాయిడ్స్ల పవర్‌హౌజ్ అని చెప్పొచ్చు. ఇది మెదడు ఆరోగ్యాన్ని పెంచుతుంది. అలాగే, కూరగాయల్లో గ్లూకోసినోలేట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి పలురకాల వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతాయి.
4. పసుపు..
పసుపు.. వృద్ధుల్లో మానసిక స్థితి, జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. పసుపులో కర్కుమిన్ ఉంటుంది. ఇది యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటుంది, ఇది ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతుంది. ఆరోగ్యకరమైన మెదడు కణాలను రిపేర్ చేస్తుంది. అలాగే, వాటిని పునరుత్పత్తి చేస్తుంది.
5. బ్లూబెర్రీస్..
బ్లూబెర్రీస్ మెదడుకు సూపర్ ఫుడ్‌గా పరిగణిస్తారు. ఈ పండు మెదడు వృద్ధాప్య ప్రక్రియను వేగవంతం చేసే ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
6. డార్క్ చాక్లెట్..
డార్క్ చాక్లెట్లో ఉండే ఒక రకమైన ఆక్సిడెంట్ ఫ్లేవనోల్స్ మెదడును గులాబీ రంగులో ఉంచడంలో సహాయపడతాయి. డార్క్ చాక్లెట్ మెదడుకు రక్తాన్ని నియంత్రిస్తుంది. మెరుగుపరుస్తుంది. మెదడు అభిజ్ఞా పనితీరును మెరుగుపరుస్తుంది.
7. నారింజ..
ఈ సిట్రస్ ఫ్రూట్ మానసికంగా బలంగా, మెదడు చురుగ్గా ఉండేందుకు సహాయపడుతుంది. వయస్సు సంబంధిత వ్యాధుల నుంచి మెదడును రక్షించడానికి అవసరమైన విటమిన్‌ను అందిస్తుంది. మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

