Five Eye Diseases | శరీరంలోని జ్ఞానేంద్రియాలలో ప్రధానమైనవి కళ్ళు. అందుకే సర్వేద్రియానం నయనం ప్రధానం అనేది. కళ్ళు హావభావాలను సైతం విడమరచి చెబుతాయి. మన సౌందర్యానికి ప్రముఖ పాత్ర వహించేవి అధ్బుతాలని.. అందాలని చూపించగలేవి కళ్ళు మాత్రమే. ఈ కళ్ళతోనే యావత్ ప్రపంచం అందాలను చూస్తున్నాం. చూపు ఎంతో విలువైందని.. దాన్ని కాపాడుకోవాలని ఎప్పటి నుంచి మన ఇంట్లోని పెద్దల నుంచి వైద్య నిపుణుల వరకు చెబుతూ వస్తున్నారు. ప్రస్తుత కాలంలో స్క్రీన్ సమయం విపరీతంగా పెరిగింది. అలాగే, జీవనశైలిలో మార్పుల కారణంగా చాలామంది దృష్టి లోపాల బారినపడుతున్నారు. 2022లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ప్రచురించి ఓ నివేదిక ప్రకారం.. భారత్లో దాదాపు 4.95 మిలియన్ల మంది అంధులు, 7కోట్లకుపైగా దృష్టి లోపంతో బాధపడుతున్న వారున్నారు. వీరిలో 0.24 మిలియన్ల అంధ మంది పిల్లలు ఉన్నారు. చాలామంది పుట్టుకతో వచ్చే అంధత్వానికి గురవుతున్నప్పటికీ.. చాలామంది తమ ఆరోగ్య సమస్యలను పట్టించుకోకపోవడంతో సమస్యల గురించి దృష్టి సారించక సమస్యల బారినపడుతున్నారు. ఇందులో ఐదు కంటి సమస్యల గురించి తెలుసుకుందాం రండి..!
60 సంవత్సరాలు పైబడిన వారిలో వయసు సంబంధిత సమస్యల బారినపడుతుంటారు. పెరుగుతున్న వయసుతో రెటీనా దెబ్బతినడం ప్రారంభమవుతుంది. దాంతో నొప్పి ఏం లేనప్పటికీ.. కొంతకాలం తర్వాత క్రమేనా కంటి చూపును కోల్పోతారు.
గ్లాకోమా అనేది మీ కంటి వెనుక భాగంలో ఉన్న ఆప్టిక్ నాడిని దెబ్బతీసే వ్యాధుల సమూహం. గ్లాకోమా రోగుల్లో సగానికిపైగా వ్యాధి గురించి తెలియదు. ఎందుకంటే ఇది చాలా నెమ్మదిగా అభివృద్ధి చెందుతుంది. మొదట సైడ్ విజన్ తగ్గుతుంది. ఆ తర్వాత పూర్తిగా చూపును కోల్పోతారు.
వృద్ధాప్యంలో కంటిశుక్లం అత్యంత సాధారణ కనిపించే కంటి సమస్య. ఇందులో ఒకటి, రెండు కళ్ళలోని లెన్స్ ప్రొటీన్ల కారణంగా మబ్బుగా కనిపిస్తాయి. ఈ ప్రొటీన్లు దట్టంగా ఏర్పడడం వల్ల.. మీ కళ్ళలోని లెన్స్ కంటిలోని ఇతర భాగాలకు స్పష్టమైన చిత్రాలను పంపకడం కష్టతరం చేస్తుంది. ఫలితంగా దృష్టిని దెబ్బతీస్తుంది.
మధుమేహం ఉన్న రోగులకు రెటినోపతి ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అధిక రక్తంలో చక్కెర కారణంగా.. రెటీనాలోని చిన్న రక్త నాళాలు దెబ్బతినడం ప్రారంభమవుతుంది. ఈ పరిస్థితిలో లీకేజ్.. అసాధారణంగా పెరిగే ప్రమాదం ఉంటుంది. దాంతో ఇది అంధత్వానికి దారితీస్తుంది.
రెటినిటిస్ పిగ్మెంటోసా అనేది కాలక్రమేణా కంటికి హాని కలిగించే వ్యాధి. ఈ అరుదైన వ్యాధి ఒక తరం నుంచి మరొక తరానికి వ్యాపిస్తుంది. లక్షణాలు తరచుగా బాల్యంలోనే కనిపిస్తాయి. రాత్రిళ్లు, తక్కువ కాంతిలో దూరదృష్టి లోపంతో ప్రారంభమవుతాయి. ఈ సమస్యలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించి.. అవసరమైన మేరకు చికిత్స తీసుకోవాలి. అప్పుడే కంటి చూపును కాపాడుకోగలుగుతారు.