న్యూఢిల్లీ : వానాకాలంలో పలువురిని వేధించే డయేరియా గురించి అవగాహన పెంచుకోవడం తప్పనిసరి. ఫుడ్ పాయిజనింగ్, గ్యాస్ట్రోఎంట్రైటిస్, ఇన్ఫెక్షన్ కారణంగా డయేరియా వ్యాప్తి చెందుతుంది. డయేరియాతో పిల్లలు, పెద్దలు బాధపడుతుంటారు. డయేరియాతో బాధపడేవారు కొద్దిరోజులు మజ్జిగ, కొబ్బరినీళ్లు వంటి ద్రవాహారాలను తీసుకున్న తర్వాత క్రమంగా రైస్, ఉడికించిన కూరగాయలు, తక్కువ నూనెతో వండిన చేప, బీఫ్, చికెన్, పాస్తా తీసుకోవచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
కారం, మసాలా దట్టించిన వంటకాలు, కొవ్వు అధికంగా ఉండే ఆహార పదార్ధాలకు దూరంగా ఉండాలి. ఇక అజీర్తి, కడుపు ఉబ్బరం, నీళ్ల విరేచనాలు, తలనొప్పి, జ్వరం, వాంతులు వంటి డయేరియా లక్షణాలు కనిపిస్తే వైద్యుడిని సంప్రదించి చికిత్స తీసుకోవాలి.