Hing | భోజనం తర్వాత ఇంగువాను ఇలా తీసుకుంటే అన్ని సమస్యలు దూరమవుతాయి!
ఇంగువ ఉరఫ్ హింగ్.. చూసేందుకు బెల్లంలాగే కనిపిస్తుంది. నోట్లో పెట్టుకుంటే మాత్రం భరించలేనంత వగరు. అయితేనేం, ఆరోగ్యానికి ఎన్నో ఉపయోగాలు. మృగశిర కార్తెనాడు చిన్న బెల్లంముక్కలో చిటికెడు ఇంగువ కలిపి నాలుకకు తగలకుండా నేరుగా గొంతులో వేసుకోవడం తరాల అలవాటు. రోజువారీ ఆహారంలో ఇంగువను భాగం చేసుకుంటే అనేక ఉపయోగాలు.
2/7
జీర్ణాశయానికి సంబంధించిన సమస్యలకు చెక్ పెట్టి.. జీవక్రియను మెరుగు పరుస్తుంది.
3/7
ఒంట్లో ఉన్న వేడిని బయటికి పంపడంలో ఇంగువకు సాటి లేదు. శ్వాస సమస్యలకు కూడా ఇంగువ మంచి ఔషధం.
4/7
పీరియడ్స్ సమయంలో వచ్చే కడుపు నొప్పి నుంచి ఇంగువ ఉపశమనం ఇస్తుంది. నెయ్యిలో కరిగించి తీసుకోవచ్చు. రక్తవృద్ధికి, గుండె ఆరోగ్యానికి బాగా పనిచేస్తుంది.
5/7
గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలుపుకొని కాస్తంత ఇంగువ పొడి వేసుకుని.. అన్నం తిన్న అరగంట తర్వాత తాగితే గ్యాస్ట్రిక్ సమస్యలు ఉండవు.
6/7
జలుబు, దగ్గు.. ఎలాంటి సీజనల్ వ్యాధులకైనా ఇంగువ తొలి ఔషధం.
7/7
పాలలో చిటికెడు ఇంగువ కలిపి తాగితే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
8/7
భోజనం తర్వాత చిటికెడు ఇంగువను మజ్జిగలో కలిపి తీసుకుంటే కడుపు ఉబ్బరం తగ్గుతుంది. తొందరగా జీర్ణమవుతుంది.