న్యూఢిల్లీ : మెరుగైన ఆహారం, క్రమం తప్పని వ్యాయామంతో ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని నిపుణులు చెబుతుంటారు. బిజీ లైఫ్, ఒత్తిడితో కూడిన జీవనశైలితో ఆరోగ్యంపై శ్రద్ధ చూపేందుకు సమయం ఉండటం లేదని ఉరుకుల పరుగుల జీవితం ఉసూరుమనిపిస్తోందని పలువురు తేల్చేస్తుంటారు.
అయితే సరైన ఆరోగ్య సంరక్షణ, కొద్దిపాటి జీవన శైలి మార్పులతో మెరుగైన ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చన్నది నిపుణుల మాట. పండంటి ఆరోగ్యానికి ఈ పదిసూత్రాలు పాటిస్తే చాలని వారు చెబుతున్నారు.
విటమిన్ డీ కోసం రోజూ పది నిమిషాల పాటు ఎండ తగిలేలా చూసుకోవడం
మాంసాహారాన్ని తగ్గించడం
వారానికి కనీసం 150 నిమిషాల పాటు వ్యాయామం
చక్కెర వాడకం తగ్గించడం
యోగా, ధ్యానం చేయడం
కాఫీ, టీలు తగ్గించడం
లిఫ్ట్లు వదిలి మెట్లు ఎక్కడం
పండ్లు, కూరగాయలు
రోజూ 6-8 గంటల పాటు నిద్ర
నీరు ఎక్కువగా తీసుకోవడం