Cardamom | యాలకులని మనం ఎంతో పూర్వకాలం నుంచే వంట ఇంటి మసాలా దినుసుగా ఉపయోగిస్తున్నాం. యాలకులను వేస్తే వంటకాలకు చక్కని రుచి, వాసన వస్తాయి. ఎక్కువగా మసాలా వంటల్లో యాలకులను వేస్తుంటారు. అయితే ఆయుర్వేద ప్రకారం యాలకులు ఎన్నో అద్భుతమైన ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. యాలకుల్లో అనేక సమ్మేళనాలు ఉంటాయి. ఇవి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. రోగాల నుంచి రక్షిస్తాయి. యాలకులను ఆహారంలో భాగం చేసుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. యాలకుల్లో యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. కనుక యాలకులను రోజూ తింటుంటే వాపులు, నొప్పులు తగ్గుతాయి. ముఖ్యంగా ఆర్థరైటిస్ నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. కీళ్లు, మోకాళ్ల నొప్పులు ఉన్నవారికి ఎంతో మేలు జరుగుతుంది.
రోజూ భోజనం చేసిన అనంతరం రెండు పూటలా ఒక యాలక్కాయను తిని ఒక గ్లాస్ గోరు వెచ్చని నీళ్లను తాగుతుండాలి. దీంతో జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. జీర్ణ క్రియ సాఫీగా జరుగుతుంది. పొట్టలో గ్యాస్ ఏర్పడదు. కడుపు ఉబ్బరం, అసిడిటీ నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే మలబద్దకం కూడా తగ్గుతుంది. పేగుల్లో ఉండే వ్యర్థాలు సులభంగా బయటకు పోతాయి. జీర్ణ వ్యవస్థ శుభ్రంగా మారుతుంది. యాలకులను తిని గోరు వెచ్చని నీళ్లను తాగితే గొంతు, ఊపిరితిత్తుల్లో ఉండే కఫం పోతుంది. దగ్గు, జలుబు, ఆస్తమా వంటి శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. శ్వాస మార్గాల్లో ఉండే అడ్డంకులు పోతాయి. శ్వాస సరిగ్గా ఆడుతుంది.
యాలకుల్లో ఒత్తిడిని తగ్గించే సమ్మేళనాలు ఉంటాయి. యాలకులను రోజూ తింటే ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. మైండ్ రిలాక్స్ అవుతుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. రాత్రి పూట చక్కగా నిద్ర పడుతుంది. పడుకున్న వెంటనే గాఢ నిద్రలోకి జారుకుంటారు. నిద్రలేమి నుంచి బయట పడవచ్చు. యాలకుల్లో డై యురెటిక్ గుణాలు ఉంటాయి. అందువల్ల యాలకులను తింటే శరీరంలోని వ్యర్థాలు, టాక్సిన్లు బయటకు పోయి శరీరం అంతర్గతంగా శుభ్రంగా మారుతుంది. శరీరం డిటాక్స్ అవుతుంది. రోగాల నుంచి రక్షణ లభిస్తుంది. యాలకుల్లో యాంటీ మైక్రోబియల్ గుణాలు ఉంటాయి. ఇవి నోట్లో ఉండే బ్యాక్టీరియాను నిర్మూలిస్తాయి. దీంతో నోటి దుర్వాసన తగ్గుతుంది. దంతాలు, చిగుళ్లు దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయి. చిగుళ్ల నుంచి రక్తం కారే సమస్య తగ్గుతుంది.
యాలకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి ఫ్రీ ర్యాడికల్స్ వల్ల మన శరీరానికి కలిగే నష్టాన్ని నివారిస్తాయి. దీంతో కణాలు సురక్షితంగా ఉంటాయి. ఫలితంగా క్యాన్సర్ రాకుండా అడ్డుకోవచ్చు. గుండె పోటు రాకుండా రక్షిస్తాయి. అధిక బరువు ఉన్నవారు రోజూ యాలకులను తిని నీళ్లను సేవిస్తుంటే ఫలితం ఉంటుంది. శరీర మెటబాలిజం పెరుగుతుంది. క్యాలరీలు ఖర్చయి కొవ్వు కరుగుతుంది. బరువు నియంత్రణలో ఉంటుంది. గుండె ఆరోగ్యానికి యాలకులు ఎంతో మేలు చేస్తాయి. వీటిని రోజూ తింటే రక్త సరఫరా మెరుగు పడుతుంది. ఇది బీపీని తగ్గిస్తుంది. హైబీపీ ఉన్నవారికి ఎంతో మేలు జరుగుతుంది. ఇలా యాలకులను తినడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు. రోజూ ఉదయం, సాయంత్రం తింటే ఎక్కువ ఫలితం ఉంటుంది.