Fruits For Liver Clean | మన శరీరంలో అంతర్గతంగా ఉన్న అతి పెద్ద అవయవం లివర్. ఇది అనేక జీవక్రియలను నిర్వహిస్తుంది. మనం తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం అయ్యేందుకు, ఆహారంలో ఉండే పోషకాలు శరీరానికి లభించేందుకు, శరీరానికి శక్తి అందేందుకు, శరీరంలోని వ్యర్థాలు బయటకు పోయేందుకు లివర్ శ్రమిస్తుంది. అయితే మనం పాటించే ఆహారపు అలవాట్లు, అస్తవ్యస్తమైన జీవన శైలి వల్ల లివర్‌లో కొవ్వు చేరుతుంది. ఇక మద్యం అధికంగా సేవించే వారికి అయితే లివర్‌లో మరింత కొవ్వు చేరుతుంది. ఇది ఇతర రోగాలకు కారణమతుంది. లివర్‌లో కొవ్వు పేరుకుపోవడం వల్ల డయాబెటిస్‌తోపాటు గుండె జబ్బులు వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి. అధికంగా బరువు పెరుగుతారు. లివర్ చెడిపోయేందుకు అవకాశం ఉంటుంది. అయితే పలు రకాల పండ్లను రోజువారి ఆహారంలో భాగం చేసుకుంటో దాంతో లివర్‌లో కొవ్వ పేరుకుపోకుండా చూడవచ్చు. అందుకు ఏయే పండ్లు సహాయ పడతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
చూసేందుకు ఆకుపచ్చ రంగులో అవకాడో పండ్లు ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తాయి. ఈ పండ్లలో పోషకాలు మెండుగా ఉంటాయి. ముఖ్యంగా అవకాడోలలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇవి లివర్ పనితీరును మెరుగు పరుస్తాయి. వాపులను తగ్గిస్తాయి. టాక్సిన్ల వల్ల లివర్ డ్యామేజ్ అవకుండా రక్షిస్తాయి. ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. దీంతో లివర్ కణాలు ఆరోగ్యంగా ఉంటాయి. బొప్పాయి పండ్లలో అనేక రకాల జీర్ణాశయ ఎంజైమ్‌లు ఉంటాయి. ఇవి లివర్ ఆరోగ్యానికి దోహదం చేస్తాయి. లివర్‌లోని వ్యర్థాలు బయటకు పోయేలా చేస్తాయి. దీంతో జీర్ణక్రియ మెరుగు పడుతుంది. మనం తిన్న ఆహారంలో ఉండే పోషకాలను శరీరం సరిగ్గా శోషించుకుంటుంది.
దానిమ్మ పండ్లలో లివర్ ఆరోగ్యానికి సహాయ పడే అనేక పోషకాలు ఉంటాయి. ఈ పండ్లలో ఉండే పాలిఫినాల్స్ లివర్ డ్యామేజ్ అవకుండా రక్షిస్తాయి. లివర్‌లో కొవ్వు పేరుకుపోకుండా చూస్తాయి. దీంతో లివర్ ఆరోగ్యం మెరుగు పడుతుంది. దానిమ్మ పండ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు లివర్‌ను రక్షిస్తాయి. దీంతో ఫ్యాటీ లివర్ సమస్య నుంచి బయట పడవచ్చు. నారింజ పండ్లలో విటమిన్ సి అధికంగా ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. ఇది లివర్‌లోని వ్యర్థాలను బయటకు పంపుతుంది. లివర్ పనితీరు మెరుగు పడేలా చేస్తుంది. దీంతోపాట శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. దీని వల్ల వాపులు సైతం తగ్గుతాయి. లివర్ ఆరోగ్యంగా ఉంటుంది.
పుచ్చకాయల్లో నీటి శాతం అధికంగా ఉంటుంది. ఈ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఇవి లివర్‌లో ఉండే వ్యర్థాలు, టాక్సిన్లను బయటకు పంపుతాయి. దీని వల్ల లివర్ ఆరోగ్యం మెరుగు పడుతుంది. లివర్ సరిగ్గా పనిచేస్తుంది. బెర్రీ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడి నుంచి లివర్‌ను రక్షిస్తాయి. దీంతో వాపులు తగ్గుతాయి. లివర్ డ్యామేజ్ అవకుండా ఉంటుంది. లివర్ పనితీరు మెరుగు పడుతుంది. రోజుకో యాపిల్ పండును తింటే డాక్టర్ వద్దకు వెళ్లాల్సిన అవసరమే రాదని చెబుతుంటారు. అయితే రోజుకో యాపిల్ పండును తింటే మాత్రం లివర్ మళ్లీ ఎప్పటిలా పనిచేస్తుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. యాపిల్ పండ్లలో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి లివర్‌ను క్లీన్ చేస్తాయి. లివర్ పనితీరు మెరుగు పడేలా చేస్తాయి. ఇలా పలు రకాల పండ్లను రోజువారి ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఫ్యాటీ లివర్ సమస్య నుంచి బయట పడడమే కాకుండా, లివర్‌లో కొవ్వు పేరుకుపోకుండా చూసుకోవచ్చు.