Kidneys Health | మన శరీరంలో ఒక్కో అవయవం ఒక్కో ముఖ్యమైన పనిని చేస్తాయి. అలాగే కిడ్నీలు కూడా తమ విధులను నిర్వహిస్తాయి. శరీరంలో ఎప్పటికప్పుడు పేరుకుపోయే వ్యర్థాలను కిడ్నీలు వడబోస్తాయి. మూత్రం ద్వారా వాటిని బయటకు పంపుతాయి. దీంతో మన శరీరంలో టాక్సిన్లు పేరుకుపోకుండా చూస్తాయి. దీని వల్ల మనం ఆరోగ్యంగా ఉంటాం. అయితే మనం పాటించే ఆహారపు అలవాట్లు, జీవన విధానం, ఇతర కారణాల వల్ల కిడ్నీలు అనారోగ్యాల బారిన పడుతుంటాయి. దీంతో కిడ్నీ స్టోన్స్ లేదా కిడ్నీ వ్యాధులు వస్తుంటాయి. అయితే పలు రకాల ఆహారాలను తరచూ తింటే కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే అన్ని పోషకాలు కలిగిన సంపూర్ణ పౌష్టికాహారాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా యాంటీ ఆక్సిడెంట్లు, సోడియం, పొటాషియం తక్కువగా ఉండే ఆహారాలను తినాలి. దీంతో కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. కిడ్నీ వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు.
క్రాన్ బెర్రీలను తినడం వల్ల కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి. క్రాన్ బెర్రీలలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. 100 గ్రాముల క్రాన్ బెర్రీలను తింటే సుమారుగా 14 మిల్లీగ్రాముల విటమిన్ సి లభిస్తుంది. వీటిల్లో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఇవి మూత్రాశయ ఇన్ఫెక్షన్లను తగ్గిస్తాయి. కిడ్నీలపై పడే భారాన్ని తగ్గిస్తాయి. దీంతో కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి. కిడ్నీ వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు. అలాగే ఆలివ్ ఆయిల్‌ను కూడా ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. ఇందులో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. 100 గ్రాముల ఆలివ్ నూనెను తీసుకుంటే సుమారుగా 884 క్యాలరీల శక్తి లభిస్తుంది. అలాగే 14 మిల్లీగ్రాముల విటమిన్ ఇ లభిస్తుంది. ఈ నూనెలో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. అందువల్ల కిడ్నీల ఆరోగ్యానికి దోహదపడతాయి. కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుతాయి.
సముద్రపు చేపలను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల కూడా కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. 100 గ్రాముల చేపలను తింటే సుమారుగా 2.3 గ్రాముల మేర ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు, 526ఐయూ విటమిన్ డి, 3.2 మైక్రోగ్రాముల విటమిన్ బి12 లభిస్తాయి. దీంతో శరీరంలోని వాపులు తగ్గుతాయి. బీపీ నియంత్రణలోకి వస్తుంది. కిడ్నీలపై పడే భారం తగ్గుతుంది. కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి. అదేవిధంగా యాపిల్స్‌ను ఆహారంలో భాగం చేసుకున్నా కూడా కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి. 100 గ్రాముల యాపిల్స్‌ను తింటే సుమారుగా 2.4 గ్రాముల మేర ఫైబర్ లభిస్తుంది. 4.6 మిల్లీగ్రాముల మేర విటమిన్ సి లభిస్తుంది. యాపిల్ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి షుగర్ లెవల్స్‌ను నియంత్రిస్తాయి. కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. దీంతో కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి.
వెల్లుల్లిలో సోడయం చాలా తక్కువగా ఉంటుంది. కనుక కిడ్నీలను ఇది ఆరోగ్యంగా ఉంచుతుంది. 100 గ్రాముల వెల్లుల్లిలో 31.2 మిల్లీగ్రాముల విటమిన్ సి, 1.7 మిల్లీగ్రాముల మాంగనీస్ ఉంటాయి. వెల్లుల్లిలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయం చేస్తాయి. బ్లూబెర్రీలలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా ఆంథో సయనిన్స్ అధికంగా ఉంటాయి. అలాగే 100 గ్రాముల బ్లూబెర్రీల్లో 9.7 మిల్లీగ్రాముల విటమిన్ సి, 2.4 గ్రాముల ఫైబర్ ఉంటాయి. అందువల్ల ఈ పండ్లను తింటే శరీరంలోని వాపులు, ఆక్సీకరణ ఒత్తిడి తగ్గుతాయి. దీని వల్ల కిడ్నీల పనితీరు మెరుగు పడుతుంది. ఇలా పలు రకాల ఆహారాలను తరచూ తీసుకోవడం వల్ల కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. కిడ్నీ వ్యాధులు రాకుండా ఉంటాయి.