Sweet Corn | సాయంత్రం సమయంలో చాలా మంది చిరుతిళ్లను తినేందుకు ఆసక్తిని చూపిస్తుంటారు. అందులో భాగంగానే బేకరీ పదార్థాలు లేదా నూనె పదార్థాలను ఎక్కువగా తింటుంటారు. కానీ వీటిని తరచూ తినడం ఆరోగ్యకరం కాదు. వీటిల్లో కొవ్వులు అధికంగా ఉంటాయి. ఇవి గుండెకు హాని చేస్తాయి. అధికంగా బరువు పెరిగేలా చేస్తాయి. దీంతో థైరాయిడ్, డయాబెటిస్ వంటి సమస్యలు వస్తాయి. కనుక సాయంత్రం సమయంలో చిరు తిళ్లను తినడం మానుకోవాలి. మరి ఆ సమయంలో ఆకలి అవుతుంది కదా.. ఏం తినాలి..? అని చాలా మందికి సందేహం వస్తుంది. అయితే ఇందుకు పోషకాహార నిపుణులు ఏమని చెబుతున్నారంటే.. సాయంత్రం సమయంలో అనారోగ్యకరమైన స్నాక్స్‌కు బదులుగా ఆరోగ్యకరమైన ఆహారాలను తినాలని వారు సూచిస్తున్నారు. స్వీట్ కార్న్ ఇదే కోవకు చెందుతుందని వారు అంటున్నారు.
స్వీట్ కార్న్‌ను తరచూ ఆహారంలో భాగం చేసుకుంటే అనేక లాభాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. స్వీట్ కార్న్ మనకు కాలాలతో సంబంధం లేకుండా ప్రతి సీజన్లోనూ లభిస్తుంది. ఈ కార్న్‌ను తినడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. స్వీట్ కార్న్‌ను ఉడకబెట్టి తినవచ్చు. లేదా సూప్స్, సలాడ్స్ వంటివి చేసుకుని తినవచ్చు. స్వీట్ కార్న్‌లో పోషకాలు అధికంగా ఉంటాయి. ముక్యంగా విటమిన్ బి1, బి9, మెగ్నిషియం, ఐరన్, పొటాషియం అధికంగా ఉంటాయి. ఇవి శరీరానికి శక్తిని అందిస్తాయి. ఎర్ర రక్త కణాలు ఉత్పత్తి అయ్యేలా చూస్తాయి. దీంతో ఆరోగ్యంగా ఉంటాం.
స్వీట్ కార్న్‌లో డైటరీ ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది పిండి పదార్థాలను సులభంగా శోషించుకుంటుంది. దీంతో బ్లడ్ షుగర్ లెవల్స్ పెరగకుండా ఉంటాయి. స్వీట్ కార్న్‌లో ఉండే ఫైబర్ ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయకుండా చేస్తుంది. ఆకలిని నియంత్రిస్తుంది. కడుపు నిండిన భావనను కలిగిస్తుంది. దీంతో ఆహారం తక్కువగా తింటారు. ఇది బరువు తగ్గేందుకు ఎంతగానో సహాయపడుతుంది. స్వీట్ కార్న్‌లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది రోగ నిరోధక వ్యవస్థను పటిష్ట పరుస్తుంది. ఆక్సీకరణ ఒత్తిడికి గురికాకుండా కణాలను రక్షిస్తుంది. దీంతో క్యాన్సర్, గుండె పోటు వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా అడ్డుకోవచ్చు.
స్వీట్ కార్న్‌లో ఉండే ఫైబర్ చెడు కొలెస్ట్రాల్ (ఎల్డీఎల్)ను తగ్గిస్తుంది. మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్)ను పెంచుతుంది. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ రాకుండా చూసుకోవచ్చు. స్వీట్ కార్న్‌లో లుటీన్, జియాజాంతిన్ అనే పోషకాలు ఉంటాయి. ఇవి యాంటీ ఆక్సిడెంట్ల జాబితాకు చెందుతాయి. ఇవి కళ్లను ఆక్సీకరణ ఒత్తిడి నుంచి రక్షిస్తాయి. దీంతో కంటి చూపు మెరుగు పడుతుంది. వయస్సు మీద పడడం వల్ల వచ్చే శుక్లాలు రాకుండా అడ్డుకోవచ్చు. కార్న్‌లో గ్లూటెన్ ఉండదు. అందువల్ల సెలియాక్ వ్యాధి లేదా గ్లూటెన్ సెన్సిటివిటీ ఉన్నవారికి ఇవి మంచి ఆహారం అని చెప్పవచ్చు. కార్న్‌లో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఫెరూలిక్ యాసిడ్, ఆంథో సయనిన్స్ వీటిలో ఎక్కువగా ఉంటాయి. ఇవి ఫ్రీ ర్యాడికల్స్‌ను నిర్మూలిస్తాయి. దీని వల్ల వాపులు తగ్గుతాయి. క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా అడ్డుకుంటాయి. ఇలా స్వీట్ కార్న్‌ను తరచూ ఆహారంలో భాగం చేసుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.