Star Fruit | మార్కెట్ లో మనకు అనేక రకాల వెరైటీ పండ్లు ఈ మధ్య కాలంలో ఎక్కువగా దర్శనమిస్తున్నాయి. చాలా మంది ఈ పండ్లను కొని తినేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు. ఇక అలాంటి పండ్లలో స్టార్ ఫ్రూట్ కూడా ఒకటి. చెప్పినట్లుగానే నక్షత్రం ఆకారంలో ఈ పండు ఎంతో ఆకర్షణీయంగా పసుపు రంగులో కనిపిస్తుంది. దీని తియ్యదనం కారణంగా ఈ పండును చాలా మంది తీపి వంటకాల తయారీలో ఉపయోగిస్తుంటారు. అయితే స్టార్ ఫ్రూట్ ఆరోగ్య పరంగా మనకు అనేక లాభాలను అందిస్తుంది. స్టార్ ఫ్రూట్‌ను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చు. మన శరీరంలోని అనేక అవయవాలకు రక్షణ ఇవ్వడంలో ఈ పండ్లు అద్భుతంగా పనిచేస్తాయి. వీటిని రోజువారి ఆహారంలో భాగం చేసుకుంటే అనేక పోషకాలను సైతం పొందవచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
స్టార్ ఫ్రూట్ ను 100 గ్రామలు మేర తింటే మనకు సుమారుగా 31 క్యాలరీలు మాత్రమే లభిస్తాయి. తియ్యగా ఉన్నప్పటికీ ఈ పండ్లలో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. కనుక బరువు తగ్గాలనుకునే వారికి ఈ పండ్లు బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. ఈ పండ్లలో ఫైబర్ అధికంగా ఉంటుంది. అందువల్ల ఈ పండ్లను తింటే కడుపు నిండిన భావన కలుగుతుంది. ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. దీంతో తినే ఆహారం శాతం తగ్గుతుంది. ఫలితంగా అధిక బరువు తగ్గవచ్చు. ఈ పండ్లను 100 గ్రాముల మేర తింటే సుమారుగా 2.8 గ్రాముల మేర ఫైబర్ పొందవచ్చు. ఇది జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. గ్యాస్, అసిడిటీ నుంచి ఉపశమనం లభిస్తుంది. మలబద్దకం తగ్గుతుంది. స్టార్ ఫ్రూట్లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. దీంతో సీజనల్ వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది. దగ్గు, జలుబు నుంచి త్వరగా ఉపశమనం పొందవచ్చు. అలాగే ఈ పండ్లలోని విటమిన్ సి చర్మాన్ని సైతం ఆరోగ్యంగా ఉంచుతుంది. చర్మం పగలకుండా ఉంటుంది.
స్టార్ ఫ్రూట్లో విటమిన్ ఎ కూడా అధిక మొత్తంలోనే ఉంటుంది. ఇది కూడా రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. దీంతోపాటు కళ్లను సంరక్షిస్తుంది. కంటి చూపు మెరుగు పడేందుకు సహాయం చేస్తుంది. స్టార్ ఫ్రూట్‌ను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల కళ్లలో శుక్లాలు రాకుండా చూసుకోవచ్చు. కంటి ఆరోగ్యం మెరుగు పడుతుంది. స్టార్ ఫ్రూట్లో విటమిన్ బి6 అధికంగా ఉంటుంది. ఇది మెదడు పనితీరును మెరుగు పరుస్తుంది. దీంతో మెదడు ఉత్తేజంగా మారుతుంది. యాక్టివ్‌గా పనిచేస్తారు. ఉత్సాహంగా ఉంటారు. నాడీ మండల వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. నరాల బలహీనత తగ్గుతుంది. మెడ, భుజం నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.
స్టార్ ఫ్రూట్లో ఉండే విటమిన్ బి6 మన శరీర మెటబాలిజంను సైతం పెంచుతుంది. దీంతో క్యాలరీలు వేగంగా ఖర్చవుతాయి. ఫలితంగా కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు. ఈ పండ్లలో పొటాషియం కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇది రక్త సరఫరాను మెరుగు పరుస్తుంది. రక్త నాళాల్లో ఉండే అడ్డంకులను తొలగిస్తుంది. దీని వల్ల హైబీపీ తగ్గుతుంది. అలాగే గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది. హార్ట్ ఎటాక్ రాకుండా చూస్తుంది. స్టార్ ఫ్రూట్లో మెగ్నిషియం కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇది నిద్రను ప్రోత్సహిస్తుంది. రాత్రి పూట ఈ పండ్లను తింటే నిద్ర చక్కగా పడుతుంది. అలాగే కండరాలు ఆరోగ్యంగా ఉంటాయి. కాలి పిక్కలు పట్టుకోవడం అనే సమస్య ఉన్నవారు ఈ పండ్లను తింటే ఉపశమనం లభిస్తుంది. ఇలా స్టార్ ఫ్రూట్‌తో మనం అనేక రకా ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.