Dry Cocount | కొబ్బరికాయలను దేవుడికి భక్తితో సమర్పిస్తుంటారు. అయితే కొబ్బరికాయలను కొట్టిన తరువాత చాలా మంది కొబ్బరిచిప్పలను ఎండబెడుతుంటారు. అనంతరం అందులోని కొబ్బరిని వంటల్లో వాడుతుంటారు. ఇక మార్కెట్లో మనకు ఎండు కొబ్బరి కూడా లభిస్తుంది. వీటిని కూడా మనం వాడుతుంటాం. చాలా మంది ఎండు కొబ్బరిని మసాలా వంటకాలు లేదా స్వీట్ల తయారీలో ఉపయోగిస్తారు. అయితే వాస్తవానికి ఎండు కొబ్బరి ఎన్నో పోషకాలను కలిగి ఉంటుంది. దీన్ని రోజూ తినడం వల్ల మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని వైద్యులు చెబుతున్నారు. రోజూ చిన్న ఎండు కొబ్బరి ముక్కను తిన్నా చాలు ఎంతో ప్రయోజనం ఉంటుందని వారు అంటున్నారు. రోజూ ఎండు కొబ్బరిని తినడం వల్ల ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
రోజూ చిన్న ఎండు కొబ్బరి ముక్కను తింటుంటే షుగర్ లెవల్స్ కంట్రోల్ అవుతాయి. ఎండు కొబ్బరిలో ఉండే సమ్మేళనాలు మనం తిన్న ఆహారాన్ని సులభంగా జీర్ణం చేస్తాయి. దీని వల్ల మనం తిన్న ఆహారంలో ఉండే పోషకాలను శరీరం సులభంగా శోషించుకుంటుంది. ఫలితంగా షుగర్ లెవల్స్ కంట్రోల్ అవుతాయి. అలాగే ఎండు కొబ్బరిని తింటే జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగు పడి శుభ్రంగా మారుతుంది. ముఖ్యంగా గ్యాస్, మలబద్దకం, అసిడిటీ. కడుపు ఉబ్బరం, పొట్టలో అసౌకర్యం వంటి సమస్యలు ఉండవు. అలాగే వికారంగా ఉండడం, వాంతికి వచ్చినట్లు ఉండడం వంటి సమస్యలు ఉన్నవారు ఎండు కొబ్బరిని తింటుంటే ఫలితం ఉంటుంది.
ఎండు కొబ్బరిలో యాంటీ వైరల్, యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. అందువల్ల దీన్ని తిన్నే మనకు బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ నుంచి రక్షణ లభిస్తుంది. దీంతో ఇన్ఫెక్షన్లు సైతం తగ్గుతాయి. అలాగే శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఎండు కొబ్బరిని తినడం వల్ల శరీరంలో ఉండే కొవ్వు కరుగుతుంది. దీని వల్ల అధిక బరువు తగ్గుతారు. ఎండు కొబ్బరిని తినడం వల్ల ఆకలి నియంత్రణలో ఉంటుంది. ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. కడుపు నిండిన భావన కలుగుతుంది. దీంతో ఆహారం తక్కువగా తింటారు. ఫలితంగా ఇది బరువు తగ్గేందుకు సహాయం చేస్తుంది. ఎండు కొబ్బరిని రోజూ కొద్దిగా తిన్నా చాలు మూత్రాశయ ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. మూత్రం సాఫీగా జారీ అవుతుంది.
ఎండు కొబ్బరిని తింటే శరీరంలోని ఎల్డీఎల్ (చెడు కొలెస్ట్రాల్) తగ్గుతుంది. హెచ్డీఎల్ (మంచి కొలెస్ట్రాల్) పెరుగుతుంది. దీంతో రక్తనాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. ఫలితంగా గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ రాకుండా కాపాడుకోవచ్చు. ఇక ఎండు కొబ్బరిని తింటే క్యాల్షియం, మాంగనీస్ సమృద్ధిగా లభిస్తాయి. ఇవి ఎముకలను దృఢంగా, ఆరోగ్యంగా ఉంచుతాయి. ముఖ్యంగా వృద్ధాప్యంలో వచ్చే ఆస్టియో పోరసిస్ సమస్య రాకుండా అడ్డుకోవచ్చు. అలాగే ఆర్థరైటిస్ నొప్పులు ఉన్నవారికి మేలు జరుగుతుంది. కీళ్ల నొప్పులు, వాపులు తగ్గుతాయి. ఇలా ఎండు కొబ్బరిని రోజువారి ఆహారంలో భాగం చేసుకుంటే ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. అయితే దీన్ని మరీ ఎక్కువగా తినకూడదు. రోజూ చిన్న ముక్కను తింటే చాలు, అనేక లాభాలను పొందవచ్చు.