Selenium Foods | మనం ఆరోగ్యంగా ఉండాలంటే అన్ని రకాల పోషకాలు కలిగిన ఆహారాలను రోజూ తింటుండాలి. అప్పుడే ఎలాంటి వ్యాధులు రాకుండా అడ్డుకోవచ్చు. పోషకాల విషయానికి వస్తే మనకు విటమిన్లు, మినరల్స్ కూడా అవసరం అవుతాయి. వీటిల్లో అనేక రకాలు ఉంటాయి. ఒక్కో పోషక పదార్థం అనేక జీవక్రియలను నిర్వహిస్తుంది. శరీరం ఆరోగ్యంగా ఉండేలా చూస్తుంది. ఇక మన శరీరానికి కావల్సిన పోషకాల్లో సెలీనియం కూడా ఒకటి. ఇది ఒక మినరల్. మనకు చాలా స్వల్ప మోతాదులో ఇది అవసరం అవుతుంది. అయితే మన శరీరానికి సెలీనియం అందించే ప్రయోజనాలు అనేకం ఉంటాయి. సెలీనియం మనల్ని అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంచుతుంది.
సెలీనియం ఉన్న ఆహారాలను తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. థైరాయిడ్ గ్రంథి పనితీరు మెరుగు పడుతుంది. యాంటీ ఆక్సిడెంట్ల రక్షణ లభిస్తుంది. సెలీనియం అధికంగా ఉండే ఆహారాలను తినడం వల్ల ఈ ప్రయోజనాలను పొందవచ్చు. రోజువారి దినచర్యలో ఈ ఆహారాలను తింటే తద్వారా శరీరానికి సెలీనియం అందేలా చూసుకోవచ్చు. పొద్దు తిరుగుడు విత్తనాలను తింటే మనకు రుచి రుచి లభించడంతోపాటు పోషకాలకు పోషకాలు కూడా అందుతాయి. ఈ విత్తనాల్లో సెలీనియం అధికంగా ఉంటుంది. పొద్దు తిరుగుడు విత్తనాలను నేరుగా తినవచ్చు. లేదా సలాడ్స్, పెరుగు, ఓట్ మీల్ వంటి వాటిపై చల్లి కూడా తినవచ్చు. ఈ విత్తనాలను తింటే సెలీనియం సమృద్ధిగా లభిస్తుంది. ఈ విత్తనాల్లో విటమిన్ ఇ కూడా అధికంగానే ఉంటుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్‌లా పనిచేస్తుంది. కణాలు డ్యామేజ్ అవకుండా రక్షిస్తుంది.
పుట్టగొడుగుల్లోనూ సెలీనియం అధికంగానే ఉంటుంది. వీటితో మనం అనేక రకాల వంటకాలను చేస్తుంటాం. స్టిర్ ఫ్రైలు, పాస్తా, సూప్‌లు వంటి వాటిల్లో వీటిని వేసి తినవచ్చు. పుట్ట గొడుగుల్లో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. విటమిన్లు, మినరల్స్ అధికంగా ఉంటాయి. ఇవి మన శరీరానికి పోషణను అందిస్తాయి. అలాగే బ్రౌన్ రైస్‌ను తింటున్నా కూడా సెలీనియం పొందవచ్చు. రోజువారి ఆహారంలో భాగంగా బ్రౌన్ రైస్‌ను తింటుండాలి. ఇందులో ఫైబర్ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. పప్పు దినుసుల్లో వృక్ష సంబంధ సమ్మేళనాలు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. అలాగే సెలీనియం కూడా ఎక్కువగానే లభిస్తుంది. పప్పు దినుసుల్లో ప్రోటీన్లు, ఫైబర్ అధిక మొత్తంలో ఉంటాయి. ఇవి మనల్ని అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంచుతాయి.
ఓట్స్‌ను కూడా ప్రస్తుతం చాలా మంది తింటున్నారు. అయితే ఓట్స్‌లో సెలీనియం సమృద్ధిగా ఉంటుంది. ఫైబర్ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఉదయాన్నే ఓట్స్‌ను తింటే శరీరానికి కావల్సిన పోషకాలను పొందవచ్చు. బీపీ నియంత్రణలో ఉంటుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. పాలకూరలో అనేక రకాల విటమిన్లు, మినరల్స్‌తోపాటు సెలీనియం సమృద్ధిగా ఉంటుంది. దీన్ని కూడా తరచూ ఆహారంలో భాగం చేసుకోవాలి. సలాడ్స్, సూప్స్, స్మూతీల తయారీలో దీన్ని ఉపయోగించవచ్చు. ఎంతో రుచిగా ఉండడమే కాదు, మనకు పాలకూర పోషణను అందిస్తుంది. ఇలా పలు రకాల ఆహారాలను తినడం వల్ల సెలీనియంను పొందవచ్చు. దీంతో ఆరోగ్యంగా ఉండవచ్చు.