Fenugreek Seeds Benefits | మెంతులను భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచే ఉపయోగిస్తున్నారు. మెంతులు చేదు రుచిని కలిగి ఉంటాయి. వీటిని వంటల్లో ఎక్కువగా వేస్తుంటారు. ముఖ్యంగా నిల్వ చేసే ఊరగాయ పచ్చళ్లలో మెంతుల వాడకం ఎక్కువగా ఉంటుంది. అయితే వాస్తవానికి ఆయుర్వేద పరంగా మెంతులు మనకు ఎంతో మేలు చేస్తాయి. మెంతుల్లో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. కనుక మెంతులను ఉదయం పరగడుపునే తినాల్సి ఉంటుంది. అయితే అందుకు గాను మెంతులను ముందు రోజు రాత్రి నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయాన్నే పరగడుపునే మెంతులను తినాలి. తరువాత 30 నిమిషాల వరకు ఎలాంటి ఆహారాలను తీసుకోరాదు. ఇలా రోజూ చేయాల్సి ఉంటుంది.
అయితే కనీసం ఒక నెల రోజుల పాటు ఇలా మెంతులను ఉదయం పరగడుపునే తింటే అనేక అద్భుతాలు జరుగుతాయి. మెంతులను తినడం వల్ల మనం పలు ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. మెంతులను తింటే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలోకి వస్తాయి. మధుమేహం పూర్తిగా నియంత్రించబడుతుంది. షుగర్ లెవల్స్ ఎక్కువగా ఉంటున్నవారు మెంతులను తింటే తప్పక ఫలితం ఉంటుంది. మెంతులను తినడం వల్ల 200కి పైగా ఉన్న షుగర్ కూడా 100కు చేరుకుంటుంది. కనుక షుగర్ ఉన్నవారు మరిచిపోకుండా రోజూ ఉదయాన్నే మెంతులను తినాలి. దీంతో డయాబెటిస్‌ను సమర్థవంతంగా నియంత్రించవచ్చు.
మెంతులను తినడం వల్ల శరీర మెటబాలిజం పెరుగుతుంది. దీంతో క్యాలరీలు వేగంగా ఖర్చవుతాయి. ఫలితంగా కొవ్వు కరుగుతుంది. దీని వల్ల అధిక బరువు తగ్గుతారు. అధిక బరువు తగ్గాలనుకునే వారు తమ రోజువారి ఆహారంలో మెంతులను భాగం చేసుకుంటే తప్పక ఫలితం ఉంటుంది. మెంతులకు కొవ్వును కరిగించే లక్షణం ఉంటుంది. అందువల్ల శరీరంలోని కొలెస్ట్రాల్ లెవల్స్ సైతం తగ్గుతాయి. దీంతో అధిక బరువు త్వరగా తగ్గుతారు. ఇక కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గడం వల్ల రక్తనాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. దీంతో హార్ట్ ఎటాక్ రాకుండా చూసుకోవచ్చు. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. గుండె పనితీరు మెరుగు పడుతుంది.
మెంతుల్లో అనేక యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. దీంతో సీజనల్ వ్యాధులైన దగ్గు, జలుబు, జ్వరం నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది. అలాగే క్యాన్సర్ కణాలు పెరగవు. దీంతో క్యాన్సర్ రాకుండా ఉంటుంది. జీర్ణ సమస్యలు ఉన్నవారు రోజూ మెంతులను తినడం వల్ల ఫలితం ఉంటుంది. మెంతులను తింటే జీర్ణక్రియ మెరుగు పడుతుంది. మలబద్దకం తగ్గుతుంది. గ్యాస్, కడుపు ఉబ్బరం నుంచి ఉపశమనం లభిస్తుంది. జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. పేగుల్లో ఉండే చెత్త అంతా బయటకు పోతుంది.
మెంతులను తింటే శరీరంలో రక్త సరఫరా మెరుగు పడుతుంది. దీంతో హైబీపీ తగ్గుతుంది. బీపీ పేషెంట్లకు మెంతులు ఒక వరమనే చెప్పవచ్చు. ఇక మెంతులను పేస్ట్‌లా చేసి జుట్టుకు పట్టిస్తుంటే చుండ్రు నుంచి విముక్తి లభిస్తుంది. శిరోజాలు ఒత్తుగా, దృఢంగా పెరుగుతాయి. మెంతులను ఫేస్ ప్యాక్‌లా కూడా ఉపయోగించవచ్చు. దీని వల్ల ముఖం కాంతివంతంగా మారుతుంది. ముఖంపై ఉండే మొటిమలు, మచ్చలు తగ్గుతాయి. ఇలా మెంతులతో అనేక లాభాలను పొందవచ్చు.