Masoor Dal | ఎర్ర కందిపప్పు.. దీన్నే మైసూర్ పప్పు. మసూర్ దాల్ అని కూడా అంటారు. కొందరు మసూర్ పప్పు అంటారు. దీన్ని కూడా కొందరు తింటుంటారు. అయితే కంది పప్పు అంటే సాధారణ పప్పునే ఎక్కువ శాతం మంది తింటారు. కానీ మైసూర్ పప్పును తినేందుకు అంతగా ఆసక్తిని చూపించరు. సాధారణ కంది పప్పుతో పోలిస్తే మైసూర్ పప్పు ధర తక్కువే. అయితే మైసూర్ పప్పును వారంలో కనీసం 2 సార్లు అయినా తినాలని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. మైసూర్ పప్పును తరచూ ఆహారంలో భాగం చేసుకుంటే అనేక ప్రయోజనాలను పొందవచ్చని వారు అంటున్నారు. ఈ పప్పులో మన శరీరానికి ఉపయోగపడే అనేక పోషకాలు ఉంటాయి. ఇవి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. రోగాలు రాకుండా చూస్తాయి. మైసూర్ పప్పును తరచూ తింటుంటే అద్బుతమైన లాభాలు కలుగుతాయని వారు అంటున్నారు.
మైసూర్ పప్పులో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా వృక్ష సంబంధ ప్రోటీన్లు ఈ పప్పులో ఉంటాయి. అందువల్ల నాన్ వెజ్ తినలేని వారికి ఈ పప్పు చక్కని ఆహారం అని చెప్పవచ్చు. ఈ పప్పును తింటే ప్రోటీన్లను పొందవచ్చు. దీని వల్ల కండరాలు నిర్మాణమవుతాయి. కణజాలం మరమ్మత్తులకు గురవుతుంది. దీంతో శరీరానికి శక్తి లభిస్తుంది. రోజంతా ఉత్సాహంగా ఉంటారు. చురుగ్గా పనిచేస్తారు. ఎంత పని చేసినా అలసట అంతగా రాదు. మైసూర్ పప్పులో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను సక్రమంగా పనిచేసేలా చేస్తుంది. దీంతో సుఖ విరేచనం అవుతుంది. మలబద్దకం తగ్గుతుంది. జీర్ణాశయం, పేగుల్లో ఉండే వ్యర్థాలు సులభంగా బయటకు పోతాయి. జీర్ణాశయం సక్రమంగా పనిచేస్తుంది.
ఈ పప్పులో క్యాలరీలు తక్కువగా, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయకుండా చేస్తుంది. దీంతో ఆకలి నియంత్రణలో ఉంటుంది. కడుపు నిండిన భావనతో ఉంటారు. దీని వల్ల ఆహారం తక్కువగా తీసుకుంటారు. ఇది బరువు తగ్గేందుకు సహాయం చేస్తుంది. బరువును నియంత్రణలో ఉంచేలా చేస్తుంది. మైసూర్ పప్పును తినడం వల్ల అధిక బరువును సులభంగా తగ్గించుకోవచ్చు. ఈ పప్పులో సంక్లిష్టమైన పిండి పదార్థాలు ఉంటాయి. ఇవి నెమ్మదిగా జీర్ణం అవుతాయి. దీని వల్ల రక్తంలో షుగర్ లెవల్స్ పెరగకుండా చూడవచ్చు. ఇది డయాబెటిస్ ఉన్నవారికి ఎంతగానో మేలు చేసే విషయం.
మైసూర్ పప్పులో మన శరీరానికి కావల్సిన ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా ఫోలేట్, పొటాషియం, మెగ్నిషియం ఉంటాయి. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి. బీపీని నియంత్రణలో ఉండేలా చేస్తాయి. దీంతో గుండె సంబంధిత వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ రాకుండా చూసుకోవచ్చు. మైసూర్ పప్పులో ఐరన్ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇది శరీరంలో శక్తి స్థాయిలు పెరిగేలా చేస్తుంది. దీంతోపాటు రక్తహీనతను తగ్గిస్తుంది. ఈ పప్పును తింటే శరీరంలో హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది. దీని వల్ల మహిళలు, చిన్నారులు ఆరోగ్యంగా ఉంటారు. రక్తం తయారవుతుంది. మైసూర్ పప్పులో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఇవి ఫ్రీ ర్యాడికల్స్‌ను నాశనం చేస్తాయి. దీని వల్ల చర్మం డ్యామేజ్ అవకుండా యవ్వనంగా ఉంటుంది. ఈ పప్పులో ఉండే విటమిన్లు, మినరల్స్ చర్మ కణాలను రిపేర్ చేస్తాయి. కణాలు మళ్లీ పునరుత్తేజం చెందేలా చేస్తాయి. దీంతో చర్మం ఎల్లప్పుడూ కాంతివంతంగా, యవ్వనంగా ఉంటుంది. ఇలా మైసూర్ పప్పును తరచూ తినడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు.