Jaggery And Turmeric | పసుపును మనం రోజూ వంటల్లో వేస్తుంటాం. పసుపు వల్ల వంటలకు చక్కని రుచి, రంగు వస్తాయి. అలాగే బెల్లాన్ని కూడా మనం ఉపయోగిస్తుంటాం. దీన్ని స్వీట్ల తయారీలో వాడుతుంటారు. అయితే మీకు తెలుసా.. పసుపు, బెల్లం మిశ్రమం ఆరోగ్య ప్రదాయినిగా పనిచేస్తుంది. ఈ రెండింటి మిశ్రమాన్ని తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. పసుపు, బెల్లం రెండింటిలోనూ ఔషధ గుణాలు సమృద్ధిగా ఉంటాయి. కనుక ఈ రెండింటినీక కలిపి తింటే అనేక వ్యాధులను నయం చేసుకోవచ్చు. అలాగే శరీరానికి పోషకాలు కూడా లభిస్తాయి. ఇవి మనకు ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. రోగాలు రాకుండా చూస్తాయి.
పసుపు, బెల్లం మిశ్రమాన్ని తినడం వల్ల సీజనల్ వ్యాధులకు చెక్ పెట్టవచ్చు. ఈ మిశ్రమంలో కర్క్యుమిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది శక్తివంతమైన యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలను కలిగి ఉండడంతోపాటు యాంటీ ఆక్సిడెంట్‌గా కూడా పనిచేస్తుంది. ఈ మిశ్రమంలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. ఇవి ఇన్ఫెక్షన్లను తగ్గిస్తాయి. రోగ నిరోధక వ్యవస్థను పటిష్టంగా ఉంచుతాయి. ఈ మిశ్రమంలో ఐరన్, జింక్ వంటి మినరల్స్ సమృద్దిగా ఉంటాయి. ఇవి శరీర సహజసిద్ధమైన రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. దీంతో దగ్గు, జలుబు, ముక్క దిబ్బడ వంటి సీజనల్ వ్యాధులకు చెక్ పెట్టవచ్చు. అలాగే జ్వరం నుంచి సైతం త్వరగా కోలుకుంటారు.
ఈ మిశ్రమంలో యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలు ఉండడం వల్ల గొంతు నొప్పికి సైతం పనిచేస్తుంది. గొంతులో గరగర, గొంతు నొప్పి, మంట వంటి గొంతు సమస్యలు ఉన్నవారు ఈ మిశ్రమాన్ని తింటుంటే ఫలితం ఉంటుంది. ఈ మిశ్రమం శ్వాసకోశ వ్యవస్థను శుభ్రం చేస్తుంది. దీంతో కఫం కరిగిపోతుంది. ముక్కు దిబ్బడ నుంచి ఉపశమనం లభిస్తుంది. దగ్గు తగ్గిపోతుంది. ఈ మిశ్రమాన్ని తినడం వల్ల అనేక జీర్ణాశయ ఎంజైమ్‌లు ఉత్పత్తి అవుతాయి. ఇవి అసిడిటీని తగ్గించడంతోపాటు మలబద్దకం నుంచి బయట పడేలా చేస్తాయి. ఈ మిశ్రమాన్ని తింటే శరీరంలోని వ్యర్థాలు, టాక్సిన్లు బయటకు పోతాయి. శరీరం అంతర్గతంగా శుభ్రంగా మారుతుంది. ముఖ్యంగా కిడ్నీలు, లివర్ క్లీన్ అవుతాయి. శరీరం డిటాక్స్ అయి ఆరోగ్యంగా ఉంటారు. రోగాలు, ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి.
బెల్లం, పసుపు మిశ్రమం సంక్లిష్టమైన పిండి పదార్థాలను కలిగి ఉంటుంది. అందువల్ల దీన్ని తింటే శరీరానికి నిరంతరం శక్తి లభిస్తుంది. ఉదయం తింటే రోజంతా శక్తి స్థాయిలు అలాగే ఉంటాయి. ఉత్సాహంగా ఉంటారు. చురుగ్గా పనిచేస్తారు. బద్దకం పోతుంది. నీరసం, అలసట ఉండవు. ఈ మిశ్రమంలో యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి కనుక దీన్ని రోజూ తింటే కీళ్లు, మోకాళ్ల నొప్పులు, వాపుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా ఆర్థరైటిస్ ఉన్నవారికి మేలు జరుగుతుంది. చలి వాతావరణంలో ఈ నొప్పులు అధికంగా ఉంటాయి కనుక ఇలాంటి వాతావరణంలో ఈ మిశ్రమాన్ని తింటే ఫలితం ఉంటుంది. అలాగే కండరాల నొప్పులు సైతం తగ్గిపోతాయి. చలి వాతావరణంలో శరీరం వేడిగా ఉండేందుకు బెల్లం, పసుపు మిశ్రమాన్ని తింటుండాలి. దీన్ని తింటే రక్త శుద్ధి జరుగుతుంది. రక్తం సహజసిద్ధంగా శుభ్రంగా మారుతుంది. రక్తంలో ఉండే వ్యర్థాలు బయటకు పోతాయి. దీంతో రోగాలు రాకుండా సురక్షితంగా ఉండవచ్చు. ఇలా పసుపు, బెల్లం మిశ్రమం మనకు అనేక రకాలుగా మేలు చేస్తుంది.