Honey And Sesame Seeds | తేనెతో మనకు ఎన్ని లాభాలు కలుగుతాయో తెలిసిందే. దీంతో అనేక రకాల అనారోగ్యాలను నయం చేసుకోవచ్చు. శరీరానికి శక్తి అందుతుంది. అలాగే నువ్వులు. వీటి నుంచి తీసిన నూనెను చాలా మంది వంటల్లో వాడుతారు. నువ్వులను డైరెక్ట్‌గా కొన్ని పిండి వంటల్లోనూ వేస్తారు. అయితే తేనె, నువ్వులను కలిపి తీసుకుంటే ఎన్నో లాభాలు కలుగుతాయని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. తేనె, నువ్వుల మిశ్రమం అనేక పోషకాలను కలిగి ఉంటుంది. దీన్ని ఉదయం పరగడుపునే తింటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. నిత్యం ఉదయాన్నే పరగడుపున ఒక టేబుల్ స్పూన్ తేనెలో ఒక టేబుల్ స్పూన్ నువ్వులు కలిపి తింటే దాంతో పలు అనారోగ్యాలను నయం చేసుకోవచ్చు. ఈ మిశ్రమం శక్తివంతమైన ఔషధంగా పనిచేస్తుంది. ఇది శక్తిని, పోషకాలను రెండింటినీ అందిస్తుంది. దీంతో అనేక వ్యాధులు సైతం నయమవుతాయి.
తేనె, నువ్వులు రెండింటిలోనూ ప్రోటీన్లు, కాల్షియం సమృద్ధిగా ఉంటాయి. దీంతో ఇవి శరీర నిర్మాణానికి ఉపయోగపడతాయి. ప్రోటీన్ల వల్ల కణజాలం వృద్ధి చెందుతుంది. కండరాలు దృఢంగా మారి ఆరోగ్యంగా ఉంటాయి. శరీరానికి కావల్సిన శక్తి లభిస్తుంది. ఉదయాన్నే ఈ మిశ్రమాన్ని తినడం వల్ల రోజంతా శరీరంలో శక్తి స్థాయిలు అధికంగా ఉంటాయి. దీంతో ఉత్సాహంగా ఉంటారు. చురుగ్గా పనిచేస్తారు. నీరసం, అలసట తగ్గుతాయి. బద్దకం పోతుంది. అలాగే ఈ మిశ్రమంలో ఉండే క్యాల్షియం వల్ల ఎముకలు దృఢంగా మారుతాయి. పిల్లలకు తేనె, నువ్వులను రోజూ పెడితే చాలా మంచిది. పోషణ సరిగ్గా అందుతుంది. వారికి శక్తి లభించడమే కాకుండా ఆరోగ్యంగా ఉంటారు. మెదడు యాక్టివ్‌గా పనిచేస్తుంది. చదువుల్లో రాణిస్తారు.
తేనె, నువ్వులు రెండింటిలోనూ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీంతో ఇవి శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తాయి. వ్యాధులు రాకుండా చూస్తాయి. ముఖ్యంగా ఈ కాలంలో వచ్చే సీజనల్ వ్యాధులు రావు. దగ్గు, జలుబు నుంచి ఉపశమనం పొందవచ్చు. ఈ మిశ్రమాన్ని తినడం వల్ల ఇన్స్టంట్ ఎనర్జీ అందుతుంది. ఉదయాన్నే శక్తి అందడం వల్ల బాడీ యాక్టివ్‌గా ఉంటుంది. రోజంతా ఉల్లాసంగా ఉంటారు. ఎంత పనిచేసినా అంత త్వరగా అలసిపోరు. ఎనర్జీ స్థాయిలు పెరుగుతాయి. వ్యాయామం చేసే వారికి శక్తి లభిస్తుంది. దీంతో త్వరగా అలసట రాదు. అలాగే ఈ మిశ్రమాన్ని తినడం వల్ల మహిళలకు సైతం ఎంతో మేలు జరుగుతుంది. మహిళలకు రుతు సమయంలో వచ్చే నొప్పులు, తిమ్మిర్లు తగ్గుతాయి. వాపుల నుంచి ఉపశమనం లభిస్తుంది.
ఈ మిశ్రమాన్ని తినడం వల్ల జీర్ణాశయం శుభ్రమవుతుంది. గ్యాస్, అసిడిటీ, అజీర్ణం, మలబద్దకం తగ్గుతాయి. పేగులు శుభ్రంగా మారుతాయి. జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. ఇక దీన్ని రోజూ తింటుంటే శరీర మెటబాలిజం పెరుగుతుంది. దీంతో క్యాలరీలు ఖర్చవుతాయి. కొవ్వు కరిగిపోతుంది. పొట్ట వద్ద ఉన్న కొవ్వు వేగంగా కరుగుతుంది. తద్వారా బరువు తగ్గుతారు. అలాగే ఆకలి నియంత్రణలో ఉంటుంది. దీని వల్ల అతిగా ఆహారం తినకుండా జాగ్రత్త పడవచ్చు. ఈ మిశ్రమాన్ని తింటుంటే చర్మం కాంతివంతంగా, మృదువుగా మారుతుంది. మచ్చలు, మొటిమలు పోతాయి. అలాగే వెంట్రుకలు ఆరోగ్యంగా ఉంటాయి. శిరోజాలు దృఢంగా, ఒత్తుగా పెరుగుతాయి. ఈ విధంగా తేనె, నువ్వుల మిశ్రమాన్ని రోజూ పరగడుపునే తినడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు.