Garlic | వెల్లుల్లిని మనం తరచూ వంటల్లో వేస్తుంటాం. వెల్లుల్లి వల్ల వంటలకు చక్కని రుచి, వాసన వస్తాయి. చాలా మంది వెల్లుల్లిని ఆహారంలో ఎంతో ఇష్టంతో తింటుంటారు. ఆయుర్వేద ప్రకారం వెల్లుల్లిలో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. వెల్లుల్లిని తినడం వల్ల అనేక వ్యాధులను నయం చేసుకోవచ్చని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. వెల్లుల్లిని రోజూ ఉదయం పరగడుపునే 2 లేదా 3 రెబ్బలను తినాలని అంటున్నారు. అయితే ఉదయం వీలుకాని వారు మధ్యాహ్నం లంచ్ కు ముందు కూడా తినవచ్చు. వెల్లుల్లి చాలా ఘాటుగా ఉంటుంది. కనుక నేరుగా వీటిని తినడం కొందరికి ఇబ్బంది అవుతుంది. అలాంటి వారు వెల్లుల్లి రెబ్బలను కచ్చా పచ్చగా దంచి అందులో కాస్త తేనె కలిపి తీసుకోవచ్చు. ఇలా వెల్లుల్లి రెబ్బలను రోజూ తినడం వల్ల అనేక లాభాలు కలుగుతాయని అంటున్నారు.
వెల్లుల్లి మన గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వెల్లుల్లి రెబ్బలను రోజూ తింటే గుండె జబ్బులు రాకుండా అడ్డుకోవచ్చు. వెల్లుల్లిని రెబ్బలను తింటుండడం వల్ల బీపీ, కొలెస్ట్రాల్ తగ్గుతాయి. దీంతో గుండె దృఢంగా, ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ రాదు. వెల్లుల్లిలోయాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఫ్రీ ర్యాడికల్స్‌ను నిర్మూలిస్తాయి. దీంతో క్యాన్సర్ కణాలు పెరగకుండా చూసుకోవచ్చు. వెల్లుల్లిని రోజూ తినే వారికి క్యాన్సర్ రాదని పరిశోధనలు కూడా చెబుతున్నాయి. వెల్లుల్లి సహజసిద్ధమైన యాంటీ బయోటిక్‌గా పనిచేస్తుంది. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్నాయి. ఇవి అనేక రకాల ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాటం చేస్తాయి. శరీర రోగ నిరోధక వ్యవస్థను పటిష్టంగా మార్చుతాయి. వెల్లుల్లిని రోజూ తింటే సీజనల్ వ్యాధులైన దగ్గు, జలుబు నుంచి ఉపశమనం పొందవచ్చు.
ఆర్థరైటిస్ నొప్పులతో బాధపడుతున్న వారికి వెల్లుల్లి మంచి ఔషధంగా పనిచేస్తుందని చెప్పవచ్చు. వెల్లుల్లిలో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. ఇవి ఆర్థరైటిస్ కారణంగా వచ్చే నొప్పులను తగ్గిస్తాయి. దీంతోపాటు వాపుల నుంచి ఉపశమనం లభిస్తుంది. కీళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. వెల్లుల్లి రెబ్బలను రోజూ తింటే జీర్ణాశయంలో ఎంజైమ్‌లు సరిగ్గా ఉత్పత్తి అవుతాయి. ఇవి జీర్ణక్రియను మెరుగు పరుస్తాయి. జీర్ణవ్యవస్థలో ఉండే వ్యర్థాలు, టాక్సిన్లను బయటకు పంపుతాయి. దీంతో మనం తిన్న ఆహారంలో ఉండే పోషకాలను శరీరం సరిగ్గా శోషించుకుంటుంది. అలాగే మలబద్దకం నుంచి ఉపశమనం లభిస్తుంది.
వెల్లుల్లిలో ఉండే అనేక విటమిన్లు, మినరల్స్ మన రోగ నిరోధక వ్యవస్థను పటిష్టంగా ఉంచుతాయి. వెల్లుల్లి రెబ్బలను తింటుంటే శరీరం వ్యాధులు, ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడుతుంది. దీంతో అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. మన ఎముకల ఆరోగ్యానికి కూడా వెల్లుల్లి ఎంతో మేలు చేస్తుంది. వెల్లుల్లిలో ఉండే పోషకాలు ఎముకల సాంద్రతను పెంచుతాయి. దీంతో ఎముకలు దృఢంగా మారి ఆరోగ్యంగా ఉంటాయి. వయస్సు మీద పడడం వల్ల వచ్చే ఆస్టియో పోరోసిస్ వంటి ఎముకల వ్యాధులు రాకుండా అడ్డుకట్ట వేయవచ్చు. వెల్లుల్లిని రోజూ తినడం వల్ల ఆకలి నియంత్రణలో ఉంటుంది. శరీర మెటబాలిజం పెరుగుతుంది. దీని వల్ల క్యాలరీలు సులభంగా ఖర్చవుతాయి. కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు. బరువు నియంత్రణలో ఉంటుంది. ఇలా వెల్లుల్లి రెబ్బలను రోజూ ఉదయం పరగడుపునే లేదా మధ్యాహ్నం లంచ్‌కు ముందు తినడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు.