Dark Chocolate | చాకొలెట్లలో అనేక రకాలు ఉంటాయన్న సంగతి తెలిసిందే. వీటిని చిన్నారుల నుంచి పెద్దల వరకు చాలా మంది ఇష్టంగానే తింటుంటారు. అయితే అన్ని చాకొలెట్లూ ఆరోగ్యకరం కాదు. కానీ డార్క్ చాకొలెట్లు మాత్రం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. డార్క్ చాకొలెట్లలో కొకొవా అధికంగా ఉంటుంది. కనుక అలాంటి చాకొలెట్లను తింటే ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయని అంటున్నారు. డార్క్ చాకొలెట్లలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. వీటి వల్లే ఈ చాకొలెట్లు ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. ఈ చాకొలెట్లలో ఫ్లేవనాల్స్ ఉంటాయి. ఇది ఒక రకమైన ఫ్లేవనాయిడ్స్ జాబితాకు చెందుతుంది. అలాగే వీటిలో పాలిఫినాల్స్ కూడా ఎక్కువగానే ఉంటాయి. ఇవి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి.
డార్క్ చాకొలెట్లలో అనేక ఆర్గానిక్ సమ్మేళనాలు ఉంటాయి. సాధారణంగా మనకు. ఇవన్నీ బెర్రీ జాతులకు చెందిన పండ్లలో అధికంగా లభిస్తాయి. కానీ డార్క్ చాకొలెట్లను తినడం వల్ల కూడా యాంటీ ఆక్సిడెంట్లను అధికంగా పొందవచ్చు. అందువల్ల ఈ చాకొలెట్లను తింటే శరీరంలో ఫ్రీ ర్యాడికల్స్ నిర్మూలించబడతాయి. దీంతో ఆక్సీకరణ ఒత్తిడి తగ్గుతుంది. కణాలకు జరిగే నష్టం నివారించబడుతుంది. దీని వల్ల శరీరంలో అంతర్గతంగా ఏర్పడే వాపులు తగ్గిపోతాయి. గుండె జబ్బులు, పలు రకాల క్యాన్సర్లు రాకుండా సురక్షితంగా ఉండవచ్చు. డార్క్ చాకొలెట్లలో అధికంగా ఉండే ఫ్లేవనాల్స్ మన శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఇది రక్త నాళాలను ప్రశాంత పరుస్తుంది. దీంతో రక్త సరఫరా మెరుగు పడుతుంది. ఫలితంగా బీపీ తగ్గుతుంది. బ్లడ్ క్లాట్స్ ఏర్పడకుండా ఉంటాయి. కనుక హైబీపీ ఉన్నవారు డార్క్ చాకొలెట్లను తింటుంటే ఎంతగానో ఫలితం ఉంటుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.
డార్క్ చాకొలెట్లలో ఉండే పాలిఫినాల్స్ మన శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ (ఎల్డీఎల్)ను తగ్గిస్తాయి. మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్)ను పెంచుతాయి. దీంతో రక్త నాళాల్లో ఉండే కొవ్వు కరిగిపోతుంది. దీని వల్ల హార్ట్ ఎటాక్ రాకుండా జాగ్రత్త పడవచ్చు. డార్క్ చాకొలెట్లు తియ్యగా ఉంటాయి. కానీ తక్కువ గ్లైసీమిక్ ఇండెక్స్‌ను కలిగి ఉంటాయి. అందువల్ల ఈ చాకొలెట్లను తింటే షుగర్ లెవల్స్ అంతగా పెరగవు. పైగా ఈ చాకొలెట్లలో ఉండే ఫ్లేవనాల్స్ ఇన్సులిన్ నిరోధకతను తగ్గిస్తాయి. దీంతో శరీరం ఇన్సులిన్‌ను సమర్థవంతంగా ఉపయోగించుకుంటుంది. ఫలితంగా షుగర్ లెవల్స్ తగ్గుతాయి. డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది. కనుక డయాబెటిస్ ఉన్నవారు కూడా నిరభ్యంతరంగా డార్క్ చాకొలెట్లను తినవచ్చు. ఎలాంటి ఆందోళన చెందాల్సిన పనిలేదు.
డార్క్ చాకొలెట్లలో ఉండే ఫ్లేవనాల్స్ మెదడుకు రక్త సరఫరాను మెరుగు పరుస్తాయి. దీని వల్ల మెదడు పనితీరు మెరుగు పడుతుంది. యాక్టివ్‌గా మారుతుంది. అప్రమత్తత పెరుగుతుంది. ఏకాగ్రత, జ్ఞాపకశక్తిని పెంచుకోవచ్చు. చిన్నారులకు డార్క్ చాకొలెట్లను తరచూ ఇస్తుంటే వారి మెదడు చురుగ్గా పనిచేస్తుంది. చదువుల్లోనూ రాణిస్తారు. అయితే డార్క్ చాకొలెట్లను మాత్రమే ఇవ్వాలి. చక్కెర అధికంగా ఉండే సాధారణ చాకొలెట్లను ఇవ్వకూడదు. ఇక డార్క్ చాకొలెట్లను తినడం వల్ల మన శరీరంలో ఎండార్ఫిన్లు రిలీజ్ అవుతాయి. ఇవి ఫీల్ గుడ్ హార్మోన్ల జాబితాకు చెందుతాయి. కనుక మన మూడ్ మారుతుంది. ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. రాత్రి పూట నిద్ర చక్కగా పడుతుంది. నిద్ర లేమి నుంచి బయట పడవచ్చు. ఇలా డార్క్ చాకొలెట్లను తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.