Orange | నారింజ పండ్లు మనకు ఏడాది పొడవునా అన్ని సీజన్లలోనూ లభిస్తాయి. ఈ పండ్లు ఎంతో రుచిగా ఉంటాయి. వీటి వాసన చూస్తే చాలు చాలా ప్రశాంతమైన ఫీలింగ్ కలుగుతుంది. తాజాదనపు అనుభూతిని ఇస్తాయి. నారింజ పండ్లలో మన శరీరానికి అవసరం అయ్యే అనేక పోషకాలు ఉంటాయి. ఈ సీజన్లో కచ్చితంగా రోజుకు ఒక నారింజ పండును తప్పనిసరిగా తినాలని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. వేసవి కాలంలో సహజంగానే మన శరీరంలోని ద్రవాలు త్వరగా ఆవిరైపోతుంటాయి. మూత్రం కన్నా చెమట ఎక్కువగా వస్తుంది. అయితే ఈ సమస్యను తగ్గించేందుకు, మూత్రం ఎక్కువగా వచ్చేలా చేసేందుకు నారింజ పండ్లు దోహదం చేస్తాయి. దీంతో శరీరంలోని ద్రవాలు పోకుండా ఉంటాయి. అలాగే వ్యర్థాలు ఎప్పటికప్పుడు బయటకు వెళ్లి పోయి శరీరం అంతర్గతంగా శుభ్రంగా మారుతుంది.
నారింజ పండ్లలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. దీని వల్ల శరీరం ఇన్ఫెక్షన్లు, వ్యాధులకు వ్యతిరేకంగా పోరాడుతుంది. తరచూ దగ్గు, జలుబు, ఫ్లూ వంటి వ్యాధుల బారిన పడుతున్నవారు నారింజ పండును రోజుకు ఒకటి చొప్పున తింటుంటే ఎంతో ఫలితం ఉంటుంది. నారింజ పండ్లలో ఉండే విటమిన్ సితోపాటు యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ ర్యాడికల్స్‌ను నిర్మూలిస్తాయి. దీంతో ఆక్సీకరణ ఒత్తిడి తగ్గుతుంది. ఫలితంగా చర్మ కణాలు డ్యామేజ్ అవకుండా ఉంటాయి. దీంతో చర్మం సాగే గుణాన్ని పొందుతుంది. చర్మం ఎల్లప్పుడూ కాంతివంతంగా ఉండి ప్రకాశిస్తుంది. యవ్వనంగా కనిపిస్తారు. సినీ తారలు చాలా మంది నారింజ పండ్లను రోజూ తింటారు. అందుకనే వారు వృద్ధాప్య వచ్చినా కూడా యవ్వనంగానే కనిపిస్తారు. కాబట్టి మీరు కూడా ఎల్లప్పుడూ యవ్వనంగా కనిపించాలంటే నారింజ పండ్లను తింటుండాలి.
ఈ పండ్లలో అధికంగా ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది. దీంతో జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. ముఖ్యంగా అజీర్తి సమస్య తగ్గుతుంది. భోజనం చేశాక కొందరికి సరిగ్గా జీర్ణం కాదు. అలాంటి వారు నారింజ పండ్లను తింటుండాలి. కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యలు ఉన్నవారు కూడా ఈ పండ్లను తింటే ఆయా సమస్యల నుంచి బయట పడవచ్చు. మలబద్దకానికి కూడా నారింజ పండ్లు చక్కని ఔషధంలా పనిచేస్తాయి. మలబద్దకం ఉన్నవారు నారింజ పండును రోజుకు ఒకటి తింటుంటే ఫలితం ఉంటుంది. నారింజ పండ్లలో ఉండే విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్‌గా కూడా పనిచేస్తుంది. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంతోపాటు గాయాలు, పుండ్లను త్వరగా మానేలా చేస్తుంది. గాయాలు లేదా పుండ్లు అయిన వారు రోజుకు ఒక నారింజ పండును తింటుంటే త్వరగా వాటిని మానేలా చేయవచ్చు.
అధిక బరువును తగ్గించేందుకు కూడా నారింజ పండ్లు ఎంతో దోహదం చేస్తాయి. ఈ పండ్లను తినడం వల్ల చాలా తక్కువ క్యాలరీలు లభిస్తాయి. అలాగే ఫైబర్ అధికంగా లభిస్తుంది కనుక ఎక్కువ సేపు ఉన్నా కడుపు నిండిన భావనతో ఉంటారు. ఆకలి వేయదు. దీంతో బరువు తగ్గవచ్చు. నారింజ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా ఫ్లేవనాయిడ్స్, కెరోటినాయిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి కణజాలాన్ని రక్షిస్తాయి. వ్యాధుల బారిన పడకుండా చూస్తాయి. నారింజ పండ్లను తింటే షుగర్ పెరుగుతుందని అనుకుంటారు. కానీ ఇది నిజం కాదు. ఎందుకంటే నారింజ పండ్లలో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు షుగర్ లెవల్స్‌ను తగ్గిస్తాయి. ఈ పండ్లు తియ్యగా ఉన్నప్పటికీ వీటి గ్లైసీమిక్ ఇండెక్స్ చాలా తక్కువ. కనుక షుగర్ ఉన్నవారు ఈ పండ్లను నిరభ్యంతరంగా తినవచ్చు. ఇలా నారింజ పండ్లను రోజువారి ఆహారంలో భాగం చేసుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.