Brown Rice | అప్పట్లో మన పూర్వీకులు ఎక్కువగా సహజసిద్ధమైన ఆహారాలనే తినేవారు. కానీ ఇప్పుడు అన్నీ కృత్రిమ ఆహారాలు అయిపోయాయి. ఇక రైస్ విషయానికి వస్తే తెల్లగా మల్లెపువ్వులా ఉంటేగానీ ఎవరూ తినడం లేదు. కానీ ఇలాంటి రైస్‌ను తినడం అంత మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వైట్ రైస్ అనేది మనకు అనేక రకాలుగా చేటు చేస్తుందని అంటున్నారు. వైట్ రైస్‌కు బదులుగా బ్రౌన్ రైస్‌ను తినాలని పోషకాహార నిపుణులు సైతం సూచిస్తున్నారు. ఒకప్పుడు మన పూర్వీకులు బ్రౌన్ రైస్‌నే అధికంగా తినేవారు. కానీ ఇప్పుడు మనం తింటున్న వైట్ రైస్ కారణంగా మనకు అనేక అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. అయితే బ్రౌన్ రైస్‌ను ఆహారంలో భాగం చేసుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. బ్రౌన్ రైస్‌ను తింటే పలు రోగాలు నయం అవుతాయని వారు అంటున్నారు.
బ్రౌన్ రైస్ గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీన్ని తింటే కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గుతాయి. శరీరంలో రక్త సరఫరా మెరుగు పడుతుంది. దీంతో హైబీపీ తగ్గుతుంది. అలాగే గుండె జబ్బులు వచ్చే రిస్క్ కూడా చాలా వరకు తగ్గుతుంది. బ్రౌన్ రైస్‌ను కాస్త తింటే చాలు, కడుపు నిండిన భావన కలుగుతుంది. దీంతో ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. ఫలితంగా తక్కువ ఆహారం తీసుకుంటారు. దీంతో క్యాలరీలు తక్కువగా లభిస్తాయి. ఇది బరువు తగ్గేందుకు ఎంతగానో సహాయ పడుతుంది. బ్రౌన్ రైస్‌ను తింటే అధిక బరువును తగ్గించుకోవడంతోపాటు బరువును నియంత్రణలో ఉంచుకోవచ్చు. బ్రౌన్ రైస్ వల్ల షుగర్ లెవల్స్ సైతం కంట్రోల్ అవుతాయి. డయాబెటిస్ ఉన్నవారికి ఈ రైస్ ఎంతగానో మేలు చేస్తుంది.
బ్రౌన్ రైస్‌లో ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. ఇది జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. ముఖ్యంగా గ్యాస్, అజీర్తి, కడుపు ఉబ్బరం నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే మలబద్దకం సైతం తగ్గుతుంది. జీర్ణవ్యవస్థ శుభ్రంగా మారుతుంది. బ్రౌన్ రైస్‌ను తింటే శరీరానికి యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా లభిస్తాయి. ఇవి రోగ నిరోధక వ్యవస్థను పటిష్టంగా మారుస్తాయి. దీంతో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. శరీరానికి హాని చేసే ఫ్రీ ర్యాడికల్స్ నాశనం అవుతాయి. దీంతో ఆక్సీకరణ ఒత్తిడి తగ్గుతుంది. ఫలితంగా క్యాన్సర్, గుండె జబ్బులు రాకుండా సురక్షితంగా ఉండవచ్చు. బ్రౌన్ రైస్ ఎముకల ఆరోగ్యానికి కూడా ఎంతగానో మేలు చేస్తుంది. ఈ రైస్‌లో మాంగనీస్ అధికంగా ఉంటుంది. ఇది ఎముకలను వృద్ధి చేయడం కోసం ఎంతగానో సహాయ పడుతుంది.
మెదడు యాక్టివ్‌గా పనిచేసేందుకు బ్రౌన్ రైస్ ఎంతగానో సహాయం చేస్తుంది. దీని వద్ద మెదడు చురుగ్గా ఉంటుంది. ఉత్తేజంగా మారుతారు. ఇలా బ్రౌన్ రైస్ వల్ల అనేక లాభాలను పొందవచ్చు. అయితే బ్రౌన్ రైస్ ఆరోగ్యకరం అయినప్పటికీ ఇందులో ఉండే ఫైబర్ కారణంగా కొందరికి ఈ రైస్‌ను తింటే ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. దీంతో గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి. కనుక అలాంటి వారు బ్రౌన్ రైస్‌ను తినకూడదు. ఇక ఈ రైస్‌ను తిన్నాక ఎలాంటి సమస్య రావడం లేదు అనుకుంటే దీన్ని తినడం కొనసాగించవచ్చు. దీంతో అన్ని రకాలుగా ఆరోగ్యంగా ఉంటారు.