Black Chickpeas | పూర్వకాలంలో మన పెద్దలు అనేక రకాల ఆహారాలను తినేవారు. వారు తినే ఆహారాలను అసలు మనం ఈ రోజుల్లో తినడం లేదు. కానీ వారి ఆహారాన్ని మనం కూడా అలవాటు చేసుకుంటే ఎలాంటి రోగాలు రాకుండా 100 ఏళ్ల వరకు జీవించవచ్చు. ఇక మన పెద్దలు ఎంతో ఇష్టంగా తిన్న ఆహారాల్లో నల్ల శనగలు కూడా ఒకటి. వీటిని తరచూ ఉడకబెట్టి గుగ్గిళ్ల రూపంలో వారు తినేవారు. అలాంటిది ఇప్పుడు మనం వీటిని తినడమే మానేశం. పొట్టు తీసిన శనగపప్పుతో అనేక పిండి వంటలు తయారు చేసి తింటున్నాం. దీని వల్ల రోగాల బారిన పడుతున్నాం. కానీ నల్ల శనగలను పొట్టు తీయకుండానే తినాల్సి ఉంటుంది. నల్ల శనగల పొట్టులో అనేక పోషకాలు ఉంటాయి. ఈ క్రమంలోనే నల్ల శనగలను రోజూ ఉడకబెట్టి తింటే అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు వీటిని తింటే పలు రోగాలను నయం చేసుకోవచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. నల్ల శనగలను తింటే అసలు ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
నల్ల శనగలను పొట్టుతో సహా తింటే ఫైబర్ సమృద్ధిగా లభిస్తుంది. ఇది జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం అయ్యేలా చేస్తుంది. దీంతో కడుపు ఉబ్బరం తగ్గుతుంది. మలబద్దకం నుంచి ఉపశమనం లభిస్తుంది. నల్ల శనగల్లో ఉండే ఫైబర్ కొలెస్ట్రాల్ లెవల్స్‌ను సైతం తగ్గిస్తుంది. దీంతో గుండె పనితీరు మెరుగు పడుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. నల్ల శనగల్లో పొటాషియం, మెగ్నిషియం అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలో రక్త సరఫరాను మెరుగు పరుస్తాయి. దీంతో హైబీపీ తగ్గుతుంది. శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ (ఎల్డీఎల్) తగ్గుతుంది. మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్) పెరుగుతుంది. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. నల్ల శనగలను తినడం వల్ల యాంటీ ఆక్సిడెంట్లు, ఫైటో న్యూట్రియెంట్లు సమృద్ధిగా లభిస్తాయి. ఇవి రక్త నాళాల్లో రక్తం గడ్డకట్టకుండా చూస్తాయి. దీంతో హార్ట్ ఎటాక్ రాకుండా అడ్డుకోవచ్చు. గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
నల్ల శనగలను తినడం వల్ల మన శరీరం న్యూరోట్రాన్స్మిటర్లను ఉత్పత్తి చేస్తుంది. ఇవి నాడీ మండల వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి. ముఖ్యంగా మెదడు పనితీరు మెరుగు పడుతుంది. మెదడు యాక్టివ్‌గా ఉంటుంది. చురుగ్గా పనిచేస్తారు. ఉత్తేజంగా ఉంటారు. అలాగే ఈ శనగల్లో ఉండే మెగ్నిషియం నాడులను సక్రమంగా పనిచేసేలా చేస్తుంది. దీంతో నరాల బలహీనత, వెన్ను నొప్పి, మెడ నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే ఈ శనగల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. దీంతో డ్యామేజ్ అయిన చర్మ కణాలు పునరుద్ధరించబడతాయి. కణాలు పునరుత్తేజం చెందుతాయి. దీనివల్ల చర్మం యవ్వనంగా కనిపిస్తుంది. కాంతివంతంగా మారుతుంది. యవ్వనంగా కనిపిస్తారు.
నల్ల శనగల్లో మాంగనీస్ అధికంగా ఉంటుంది. ఇది ఫ్రీ ర్యాడికల్స్‌ను నాశనం చేస్తుంది. దీంతో కణాలు రక్షించబడతాయి. వయస్సు మీద పడడం వల్ల వచ్చే వృద్ధాప్య ఛాయలు తగ్గుతాయి. దీంతో యవ్వనంగా కనిపిస్తారు. అలాగే శిరోజాలను ఒత్తుగా పెరిగేలా చేయడంలోనూ నల్ల శనగలు ఎంతో ఉపయోగపడతాయి. వీటిని రోజూ తినడం వల్ల వెంట్రుకలు ఆరోగ్యంగా ఉంటాయి. అధిక బరువు తగ్గేందకు సైతం నల్ల శనగలు ఎంతగానో దోహదం చేస్తాయి. బరువు తగ్గాలనుకునేవారు నల్ల శనగలను రోజువారి ఆహారంలో తీసుకోవాల్సి ఉంటుంది. వీటిని తింటే షుగర్ లెవల్స్ సైతం అదుపులోకి వస్తాయి. ఇలా నల్ల శనగలు అనేక లాభాలను అందిస్తాయి. కనుక వీటిని రోజూ తినడం మరిచిపోకండి.