Black Seeds | మీకందరికీ కాలోంజీ విత్తనాల గురించి తెలిసే ఉంటుంది. వీటినే ఆంగ్లంలో బ్లాక్ సీడ్స్ అని కూడా పిలుస్తారు. వీటిని చాలా మంది సహజంగానే ఉపయోగించరు. అందువల్ల ఈ విత్తనాల గురించి చాలా మందికి తెలియదు. ఈ విత్తనాలను ఆయుర్వేదంలో ఎంతో పురాతన కాలం నుంచే ఔషధాలుగా ఉపయోగిస్తున్నారు. ఈ విత్తనాల నుంచి నూనెను తీస్తారు. కాలోంజీ విత్తనాలను రోజూ నీటిలో వేసి మరిగించి ఆ నీళ్లను తాగవచ్చు. లేదా ఈ విత్తనాలను పొడిగా చేసి మనం తినే ఆహారాలపై చల్లి తీసుకోవచ్చు. ఈ క్రమంలో బ్లాక్ సీడ్స్ వల్ల మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. బ్లాక్ సీడ్స్‌ను ఆహారంలో భాగం చేసుకోవాలని వారు సూచిస్తున్నారు.
బ్లాక్ సీడ్స్ లో అనేక పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ విత్తనాల్లో విటమిన్లు ఎ, బి12, నియాసిన్, విటమిన్ సి అధికంగా ఉంటాయి. ఇవి జుట్టును ఆరోగ్యంగా ఉంచుతాయి. చర్మాన్ని సంరక్షిస్తాయి. జుట్టు రాలే సమస్య ఉన్నవారు బ్లాక్ సీడ్స్‌ను వాడుతుంటే ఎంతగానో ప్రయోజనం ఉంటుంది. ఈ విత్తనాలను పొడిగా చేసి నేరుగా జుట్టుకు లేదా చర్మానికి అప్లై చేయవచ్చు. దీని వల్ల శిరోజాలు, చర్మం సంరక్షించబడతాయి. జుట్టు రాలడం తగ్గుతుంది. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. చర్మం కాంతివంతంగా మారి మెరుస్తుంది. యవ్వనంగా కనిపిస్తారు. ముఖంపై ఉండే మొటిమలు, మచ్చలు పోతాయి.
బ్లాక్ సీడ్స్‌లో అనేక రకాల సమ్మేళనాలు ఉంటాయి. ఇవి మన మూడ్‌ను మారుస్తాయి. మైండ్ రిలాక్స్ అయ్యేలా చేస్తాయి. దీంతో ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. తీవ్రమైన ఒత్తిడితో సతమతం అవుతున్న వారు బ్లాక్ సీడ్స్‌ను వాడితే ఫలితం ఉంటుంది. రాత్రి పూట నిద్ర కూడా చక్కగా పడుతుంది. పడుకున్న వెంటనే గాఢ నిద్రలోకి జారుకుంటారు. నిద్రలేమి తగ్గుతుంది. బరువు తగ్గాలనుకునే వారికి బ్లాక్ సీడ్స్ ఎంతో మేలు చేస్తాయి. ఈ విత్తనాలను తీసుకోవడం వల్ల మెటబాలిజం పెరుగుతుంది. దీంతో క్యాలరీలు వేగంగా ఖర్చవుతాయి. ఫలితంగా కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు.
బ్లాక్ సీడ్స్‌ను తీసుకోవడం వల్ల శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా అలర్జీలు, ఆస్తమా వంటివి ఉన్నవారికి మేలు జరుగుతుంది. బ్లాక్ సీడ్స్‌లో యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. ఇవి శ్వాసకోశ వ్యవస్థను ప్రశాంత పరుస్తాయి. దీంతో శ్వాస సరిగ్గా లభిస్తుంది. దగ్గు, జలుబు నుంచి సైతం ఉపశమనం పొందవచ్చు. బ్లాక్ సీడ్స్ లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ రాకుండా నివారించవచ్చు. క్యాన్సర్ కణాలు పెరగకుండా అడ్డుకోవచ్చు. బ్లాక్ సీడ్స్‌లో ఉండే యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలు మెటబాలిక్ సిండ్రోమ్, ఆటో ఇమ్యూన్ వ్యాధులు వంటి సమస్యలను తగ్గించడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి. దీంతో ఆయా వ్యాధులు ఉన్నవారికి ఎంతో మేలు జరుగుతుంది. ఇలా బ్లాక్ సీడ్స్‌ను తీసుకోవడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు.