Banana Flower | అరటి పండ్లు అంటే చాలా మందికి ఇష్టమే. ఈ పండ్లు మనకు ఏడాది పొడవునా అన్ని సీజన్లలోనూ అందుబాటులో ఉంటాయి. ఈ పండ్లను చాలా మంది ఇష్టంగా తింటారు. ధర కూడా తక్కువగానే ఉంటుంది. అరటి పండ్లలోనూ అనేక వెరైటీలు ఉంటాయి. అయితే కేవలం అరటి పండ్లే కాదు.. అరటి పువ్వు కూడా మనకు ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. అరటి పువ్వును కొందరు కూరగా వండుకుని తింటుంటారు. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. అరటి పువ్వులో మన శరీరానికి కావల్సిన అనేక పోషకాలు ఉంటాయి. అరటి పువ్వును ఆహారంలో భాగం చేసుకుంటే అనేక ప్రయోజనాలను పొందవచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అరటి పువ్వులో విటమిన్లు ఎ, సి, ఇ ఉంటాయి. పొటాషియం, క్యాల్షియం, మెగ్నిషియం, ఐరన్, జింక్ సమృద్ధిగా ఉంటాయి.
అరటి పువ్వులో ఉండే విటమిన్ ఎ కంటి చూపును మెరుగు పరుస్తుంది. కళ్ల సమస్యలను తగ్గిస్తుంది. కళ్లలో శుక్లాలు రాకుండా చూస్తుంది. అలాగే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. శరీరం వ్యాధులు, ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడుతుంది. చర్మాన్ని సంరక్షిస్తుంది. అరటి పువ్వులో ఉండే విటమిన్ సి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఇన్ఫెక్షన్లు రాకుండా చూస్తుంది. ఈ పువ్వులో ఉండే విటమిన్ ఇ చర్మాన్ని రక్షిస్తుంది. చర్మంపై ఉండే ముడతలు, మచ్చలు పోతాయి. ముఖం కాంతివంతంగా మారి మెరుస్తుంది. యవ్వనంగా కనిపిస్తారు. అరటి పువ్వులోని విటమిన్ ఇ పురుషులకు ఎంతో మేలు చేస్తుంది. తరచూ అరటి పువ్వును తింటే పురుషుల్లో శృంగార సామర్థ్యం పెరుగుతుంది. శృంగారంలో చురుగ్గా పాల్గొంటారు. ఒత్తిడి, ఆందోళన, నీరసం, అలసట తగ్గుతాయి.
అరటి పండు కన్నా అరటి పువ్వులోనే పొటాషియం అధిక మొత్తంలో ఉంటుంది. ఇది రక్త సరఫరాను మెరుగు పరుస్తుంది. రక్త ప్రసరణ సరిగ్గా అయ్యేలా చేస్తుంది. దీంతో బీపీ తగ్గుతుంది. హైబీపీ నియంత్రణలో ఉంటుంది. బీపీ ఉన్నవారు తరచూ అరటి పువ్వును తింటుంటే ఎంతో మేలు జరుగుతుంది. అరటి పువ్వులో ఉండే క్యాల్షియం ఎముకలు, దంతాలను దృఢంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈ పువ్వులోని మెగ్నిషియం కండరాల పనితీరుకు సహకరిస్తుంది. కండరాల నొప్పుల నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది. రాత్రి పూట కాలి పిక్కలు పట్టుకుపోయే సమస్య ఉన్నవారు తరచూ అరటి పువ్వును తింటే మేలు జరుగుతుంది. అరటి పువ్వులో ఉండే ఐరన్ రక్తం తయారయ్యేలా చేస్తుంది. దీంతో రక్తహీనత తగ్గుతుంది. ఈ పువ్వులోని జింక్ రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. శిరోజాలు, గోర్లకు సంరక్షణను అందిస్తుంది.
అరటి పువ్వులో క్వర్సెటిన్, కాటెకిన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఫ్రీ ర్యాడికల్స్ వల్ల శరీరానికి కలిగే నష్టాన్ని నివారిస్తాయి. దీంతో క్యాన్సర్, గుండె పోటు వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా అడ్డుకోవచ్చు. అరటి పువ్వులో ఉండే ఫైబర్ జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. అరటి పువ్వును తరచూ తింటే జీర్ణ క్రియ మెరుగు పడుతుంది. మలబద్దకం తగ్గుతుంది. ఈ పువ్వులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు షుగర్ లెవల్స్‌ను తగ్గిస్తాయి. టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారు తరచూ ఈ పువ్వును కూరగా వండుకుని తింటే ఎంతో మేలు జరుగుతుంది. దీంతో డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది. అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారికి కూడా ఈ పువ్వు ఎంతో మేలు చేస్తుంది. దీంతో రక్త నాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఇలా అరటి పువ్వుతో అనేక లాభాలను పొందవచ్చు.