Cucumber Seeds | మనకు మార్కెట్లో రెండు రకాల దోసకాయలు లభిస్తాయన్న సంగతి తెలిసిందే. కీరదోసతోపాటు కూర దోస కాయలు కూడా మనకు లభిస్తాయి. అయితే కీరదోసలో ఉండే విత్తనాలు చాలా పలుచగా ఉంటాయి. కనుక వీటిని ప్రత్యేకంగా సేకరించి తినలేం. అదే కూర దోసకాయల్లోని విత్తనాలు అయితే కాస్త మందంగా ఉంటాయి. ఇక చాలా మంది ఈ విత్తనాలను పడేస్తుంటారు. కేవలం దోసకాయను మాత్రమే కూరల్లో వేస్తుంటారు. అయితే వాస్తవానికి దోసకాయ విత్తనాలు కూడా ఎన్నో పోషకాలను కలిగి ఉంటాయి. దోసకాయ విత్తనాలను ఎండ బెట్టి వేయించుకుని తినవచ్చు. సాయంత్రం సమయంలో స్నాక్స్‌కు బదులుగా దోసకాయ విత్తనాలను తింటే రుచికి రుచి, పోషకాలకు పోషకాలు లభిస్తాయి. దోసకాయ విత్తనాలను రోజూ గుప్పెడు మోతాదులో తింటుంటే పలు వ్యాధులను నయం చేసుకోవచ్చు.
దోసకాయ విత్తనాల్లో ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థ పనితీరును మెరగుపరుస్తుంది. ఈ విత్తనాలను తింటుంటే పేగుల్లో మలం సులభంగా కదులుతుంది. దీంతో విరేచనం సాఫీగా అవుతుంది. మలబద్దకం ఉండదు. అలాగే గ్యాస్, అజీర్తి, కడుపు ఉబ్బరం సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. దోసకాయ విత్తనాల్లో చాలా వరకు నీరే ఉంటుంది. అందువల్ల ఈ విత్తనాలను తింటే శరీరంలో ద్రవాలు సమతుల్యంలో ఉంటాయి. శరీరం హైడ్రేట్ అవుతుంది. దోస విత్తనాలను తింటుంటే శరీర జీవక్రియలు కూడా సరిగ్గా నిర్వహించబడతాయి. శరీర ఉష్ణోగ్రత క్రమబద్దంగా ఉంటుంది. కీళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. అధిక బరువు తగ్గాలని చూస్తున్నవారు దోస విత్తనాలను రోజూ ఆహారంలో భాగం చేసుకోవాలి. ఈ విత్తనాల్లో అధికంగా ఉండే ఫైబర్ కడుపు నిండిన భావనను కలిగిస్తుంది. దీంతో ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. ఆహారం తక్కువగా తింటారు. ఇది బరువు తగ్గేందుకు సహాయ పడుతుంది.
దోసకాయ విత్తనాల్లో యాంటీ ఆక్సిడెంట్లు కూడా అధికంగానే ఉంటాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. దీంతో కణాలు డ్యామేజ్ అవకుండా చూసుకోవచ్చు. మన శరీరం క్యాన్సర్, గుండె పోటు వంటి తీవ్రమైన వ్యాధుల బారిన పకుండా దోసకాయ విత్తనాల్లోని యాంటీ ఆక్సిడెంట్లు సహాయం చేస్తాయి. దోస విత్తనాల్లో మెగ్నిషియం, పొటాషియం అధికంగా ఉంటాయి. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఈ విత్తనాల్లో ఉండే మినరల్స్ బీపీని తగ్గిస్తాయి. గుండె సాధారణంగా కొట్టుకునేలా చేస్తాయి.
దోస విత్తనాల్లో విటమిన్ ఇ, ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. విటమిన్ ఇ వల్ల ఫ్రీ ర్యాడికల్స్ కారణంగా దెబ్బ తిన్న చర్మ కణాలు రిపేర్ అవుతాయి. ఫ్యాటీ యాసిడ్ల వల్ల చర్మానికి తేమ లభిస్తుంది. సాగే గుణాన్ని పొందుతుంది. దీంతో చర్మం కాంతివంతంగా మారి యవ్వనంగా కనిపిస్తుంది. దోస విత్తనాల్లో క్యాల్షియం, ఫాస్ఫరస్ అధికంగా ఉంటాయి. ఇవి ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఈ విత్తనాల్లో ఉండే మినరల్స్ ఎముకల సాంద్రతను పెంచుతాయి. దీంతో ఆస్టియోపోరోసిస్ రాకుండా చూసుకోవచ్చు. దోస విత్తనాల్లో జింక్ అధికంగా ఉంటుంది. ఇది రోగ నిరోధక వ్యవస్థను పటిష్టంగా మారుస్తుంది. జింక్ వల్ల తెల్ల రక్త కణాలు వృద్ధి చెందుతాయి. ఇవి ఇన్ఫెక్షన్లను తగ్గిస్తాయి. ఇలా దోస విత్తనాలను తింటే అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.