కూరలో కరివేపాకును తీసిపారేస్తున్నారా.. ఈ విషయాలు తెలిస్తే అలా చేయరు
కరివేపాకు లేకుంటే కూరకు రుచి, వాసన రాదు.. అందుకే చాలామంది గృహిణులు కరివేపాకు లేకుండా వంట చేయడానికి ఇష్టపడరు. కేవలం రుచి, వాసనకే కాదు

కరివేపాకు లేకుంటే కూరకు రుచి, వాసన రాదు.. అందుకే చాలామంది గృహిణులు కరివేపాకు లేకుండా వంట చేయడానికి ఇష్టపడరు. కేవలం రుచి, వాసనకే కాదు.. కరివేపాకులో ఎన్నో పోషకాలు ఉంటాయి. రోజూ ఆహారంలో తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది. అలాంటిది మనం మాత్రం తినేప్పుడు తేలిగ్గా కరివేపాకును తీసిపారేస్తుంటాం. కానీ కరివేపాకు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలిస్తే అలా తీసిపారేయాలంటే ఆలోచిస్తారు. మరి ఆ ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో చూద్దామా..

అజీర్తి సమస్యలు దూరం
కరివేపాకులో ల్యూటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. ఫోలికామ్లం, నియాసిన్, బీటా కెరోటిన్, ఇనుము, కాల్షియం, పీచు, మాంసకృత్తులు, కార్బొహ్రైడేట్లు పుష్కలంగా లభిస్తాయి. జీర్ణక్రియ సజావుగా సాగేందుకు, మలబద్దకాన్ని నివారించేందుకు పీచు సహకరిస్తుంది. కొద్దిగా కరివేపాకు మిశ్రమాన్ని గ్లాసులో మజ్జిగలో చిటికెడు ఇంగువ, కరివేపాకు, కాస్త సొంపు కలిపి తాగితే అజీర్తి సమస్య దూరమవుతుంది.

కళ్లకు మంచిది
కరివేపాకులో విటమిన్ ఏ పుష్కలంగా లభిస్తుంది. ఇది కంటి సమస్యలను తగ్గిస్తుంది. ప్రతిరోజూ తినే ఆహారంలో కరివేపాకు వేయడం వల్ల వయసు పెరిగే కొద్దీ వచ్చే క్యాటరాక్ట్ సమస్యలు దూరం అవుతాయి.

మధుమేహం నియంత్రణ
క్రమం తప్పకుండా కరివేపాకును తినడం వల్ల రక్తంలోని చక్కెరస్థాయులు అదుపులో ఉంటాయి. కరివేపాకులోని యాంటీ హైపర్ గ్లెసెమిక్.. రక్తనాళాల్లోని గ్లూకోజ్‌ను నియంత్రిస్తుంది. తద్వారా మధుమేహం నియంత్రణలో ఉంటుంది.
బరువు నియంత్రణ
రోజూ ఆహారంలో కరివేపాకును తినడం వల్ల బరువు నియంత్రణలో ఉంటుంది. రోజూ నాలుగు పచ్చి కరివేపాకు ఆకుల్ని నమలడం వల్ల కొవ్వుస్థాయులు తగ్గుతాయి.

యూరిన్ సమస్యలకు చెక్
కరివేపాకులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు యూరిన్, బ్లాడర్ సమస్యలను తగ్గిస్తాయి. కరివేపాకు రసంలో కొంచెం దాల్చిన చెక్క పొడి కలుపుకుని తాగడం ద్వారా మూత్ర సంబంధిత సమస్యలను నివారించవచ్చు. కిడ్నీ సమస్యలను కూడా కరివేపాకు దూరం చేస్తుంది.

చర్మ సంరక్షణకు
వేపాకు, కరివేపాకును సమపాళ్లలో తీసుకుని ఒక ముద్ద చేసుకుని.. రోజూ అరకప్పు మజ్జిగతో తీసుకుంటే చర్మ సంబంధిత సమస్యలు దూరమవుతాయి. చర్మంపై దద్దులు తగ్గుతాయి. కరివేపాకు మిశ్రమానికి పసుపు కలిపి చర్మానికి పూసుకోవడం ద్వారా చర్మపు మంటలు తగ్గుతాయి.
రక్తహీనత దూరం
కరివేపాకులో ఐరన్ పుష్కలంగా లభిస్తుంది. రోజూ కరివేపాకును ఆహారంలో తీసుకోవడం ద్వారా రక్తంలో ఐరన్ పెరుగుతుంది. అలాగే కరివేపాకులోని ఫోలికామ్లం రక్తహీనతను నివారిస్తుంది.

కురుల సంరక్షణకు
కొబ్బరి నూనెలో కరివేపాకు వేసి వేడి చేయాలి. దీన్ని చల్లార్చి తలకు పట్టించి మర్దన చేయాలి. 20 నిమిషాల తర్వాత తలస్నానం చేయాలి. ఇలా తరచూ చేయడం వల్ల జుట్టు ఊడే సమస్య తగ్గుతుంది.
జుట్టు నెరవకుండా
కొందరిలో చిన్నప్పుడే తెల్ల జుట్టు వస్తుంది. ఆ సమస్యకు కూడా కరివేపాకు చక్కగా పనిచేస్తుంది. కొంచెం కొబ్బరి నూనెలో మెంతికూర, వేపాకు, కరివేపాకు వేసి చిన్న మంటపై వేడిచేయాలి. దీన్ని చల్లార్చి పడుకునే ముందు తలకు పట్టించాలి. మరుసటి రోజు ఉదయం తలస్నానం చేయాలి. ఇలా తరచూ చేయడం వల్ల జుట్టు నెరవకుండా నల్లగా నిగనిగలాడుతుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
పుచ్చకాయ కొంటున్నారా? ఇవి తెలుసుకోండి
షుగర్ ఉన్నోళ్లు ఈ పండ్లు తినొచ్చా
బట్టలు తెల్లగా మెరవాలా? ఇలా ట్రై చేయండి
Read Today's Latest Health News in Telugu and Telugu News
- Tags
- Curry leaf
- Curry leaves
- Food
- Health
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

