ఎండాకాలం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా శరీరం కమిలిపోతుంది. దానికి తోడు దుమ్మూ ధూళీ చర్మాన్ని పాడుచేస్తాయి. ఈ సమస్య నుంచి ఊరట పొందేందుకు కొందరు స్కార్ఫ్‌ను ఆశ్రయిస్తారు. అయితే స్కార్ఫ్ కట్టుకోవడం అందరికీ చేతకాదు. అదో కళ. ఈ ఇబ్బందులకు పరిష్కారంగా మార్కెట్లోకి వస్తున్నదే ‘సన్ ప్రొటెక్షన్ స్కార్ఫ్’.
దీన్ని భుజాల మీదుగా వేసుకుని టోపీలా పెట్టుకోవచ్చు. తలను నిండుగా కప్పేస్తుంది. వెంట్రుకలకూ కాలుష్యం, ఎండ నుంచి రక్షణనిస్తుంది. ముఖం, మెడ రంగు మారకుండా కాపాడుతుంది. నూలుతో చేసినవి కాబట్టి, సౌకర్యంగానూ ఉంటాయి. ఇవి అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ తదితర వెబ్సైట్లలో దొరుకుతాయి. ఇక, ఎండలకు భయపడాల్సిన పన్లేదు.