Chapati | ఇటీవలి కాలంలో చాలా మంది ప్రధానంగా డయాబెటిస్( Diabetics ) బారిన పడుతున్నారు. అదేనండి.. షుగర్ బారిన. ఈ వ్యాధి బారిన పడ్డ బాధితులు ఆహారపు అలవాట్లను( Food Habits ) పూర్తిగా మార్చేసుకుంటున్నారు. అన్నంను పూర్తిగా పక్కనబెట్టి.. రొట్టెల వైపు మొగ్గు చూపుతున్నారు. అది జొన్న రొట్టె కావొచ్చు.. గోధుమ పిండితో తయారు చేసిన చపాతీ( Chapati )లు కావొచ్చు. మరి షుగర్ వ్యాధిగ్రస్తులు ప్రతి రోజు చపాతీలు తినడం ఆరోగ్యానికి మంచిదేనా..? అనే విషయం తెలుసుకుందాం.
అన్నంతో పోల్చితే.. చపాతీలు డయాబెటిస్ రోగులకు మంచిదని చెప్పొచ్చు. ఎందుకంటే చపాతీల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. సో చపాతీలు రక్తంలో షుగర్ లెవల్స్‌ను నెమ్మదిగా పెంచుతాయని చెబుతున్నారు. కాబట్టి డయాబెటిస్తో బాధపడుతున్న వారికి లేదా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించాలనుకునే వారికి చపాతీలు మంచిదే అని సూచిస్తున్నారు. రక్తంలో గ్లూకోజ్, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది కాబట్టి.. ప్రతి రోజు చపాతీలు తినడం వల్ల లాభాలే ఉన్నాయని చెబుతున్నారు.
రక్తంలో గ్లూకోజ్, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడమే కాదు.. మలబద్దకం నివారణకు కూడా చపాతీలు ఉపయోగపడుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చపాతీలకు ఉపయోగించే గోధుమ పిండిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఈ ఫైబర్ జీర్ణక్రియకు సహాయపడుతుంది. దీంతో మలబద్దకం నివారించడంతో పాటు పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
బరువు నియంత్రణకు కూడా చపాతీలు దోహదపడుతాయి. ఒక చపాతీలో సుమారు 70 నుంచి 100 కేలరీలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చపాతీలో ఫైబర్ అధికంగా ఉండడం వల్ల కడుపు నిండినట్లు అనిపిస్తుంది. తద్వారా ఆకలి వేయదు. దీంతో బరువు తగ్గేందుకు కూడా చపాతీలు సహాయపడుతాయి.