Health tips : కొలెస్ట్రాల్ లెవెల్స్‌ను మెరుగ్గా మెయింటెయిన్ చేయడం ద్వారా హృద్రోగాలకు దూరంగా ఉండటంతో పాటు దీర్ఘాయువునూ సొంతం చేసుకోవచ్చు. మంచి కొలెస్ట్రాల్‌గా పిలిచే హెచ్‌డీఎల్, చెడు కొలెస్ట్రాల్‌గా వ్యవహరించే ఎల్డీఎల్లపై ఓ కన్నేసి ఉంచడంతో పాటు ప్రమాదకర కొవ్వులు ట్రైగ్లిజరైడ్లకు కళ్లెం వేసే ఆహారం అధికంగా తీసుకుంటే ఆరోగ్యానికి మేలని నిపుణులు చెబుతున్నారు.
చెడు కొలెస్ట్రాల్‌గా పరిగణించే ఎల్డీల్, ట్రైగ్లిజరైడ్లను తగ్గించేందుకు నువ్వుల నూనె, రైస్‌బ్రాన్ ఆయిల్ చక్కగా పనిచేస్తాయని వెల్లడైంది. ఈ రెండు నూనెలను కలిపి తీసుకోవడం ద్వారా ఎల్డీఎల్ లెవెల్స్ తగ్గడంతో పాటు అదే సమయంలో హెచ్‌డీఎల్ పెరుగుతుందని తాజా పరిశోధనలో తేలింది. నువ్వుల నూనె, రైస్‌బ్రాన్ ఆయిల్‌తో కలిపి చేసిన వంటకాలతో బీపీ, కొలెస్ట్రాల్ లెవెల్స్ గణనీయంగా తగ్గుతాయని ది సైన్స్ డైలీ తెలిపింది.
ఈ రెండు నూనెల మిశ్రమం వాడితే మందులు తీసుకున్న ఫలితాలు చేకూరతాయని మందులతో పాటు ఈ నూనెల మిశ్రమ వాడితే మెరుగైన ఫలితాలు వస్తాయని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ చేపట్టిన హై బ్లడ్ఫ్లెషర్ రీసెర్చి సైతం వెల్లడించింది. ఈ నూనెల్లో సంతృప్త కొవ్వులు తక్కువగా ఉండటంతో పాటు యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటంతో గుండె ఆరోగ్యానికి మేలు కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు.