లండన్ : హైట్ ఎక్కువగా ఉండాలని ఎత్తుగా కనిపించడం కోసం ఏం చేయడానికి కూడా పలువురు సిద్ధపడుతుంటారు. అయితే హైట్‌తో లాభనష్టాలు రెండూ ఉన్నాయని తాజా సర్వే వెల్లడించింది. నరాలు దెబ్బతినడం, చర్మ, ఎముకల ఇన్ఫెక్షన్కు గురయ్యే ముప్పు వీరిలో అధికమని చెబుతున్నారు.
అయితే ఎత్తులో ఏమీ లేదా అని నిరాశపడకుండా హైట్‌గా ఉన్నవారిలో హృద్రోగ ముప్పు, అధిక రక్తపోటు, అధిక కొవ్వు వంటి రిస్క్‌లు తక్కువగా ఉంటాయని తేలింది. ఎత్తుకు, వ్యాధులకు మధ్య ఉండే సంబంధంపై ప్రపంచంలోనే అతిపెద్ద అధ్యయనం వివరాలు జర్నల్ పీఎల్ఓఎస్ జెనెటిక్స్‌లో ప్రచురితమయ్యాయి.
వేలాది మంది క్లినికల్ రికార్డులతో కూడిన జెనెటిక్ డేటా కలిగిన వీఏ మిలియన్ వెటరన్ ప్రోగ్రాం గణాంకాలను అధ్యయన బృందం ఉపయోగించుకుంది. అధ్యయనంలో భాగంగా 3,23,793 మంది రికార్డులను పరిశోధకులు పరిశీలించి ఈ వివరాలు నిగ్గుతేల్చారు. ఎత్తు పలు వైద్య లక్షణాలతో ముడిపడిఉందని ఈ అధ్యయనం గుర్తించింది. క్లినికల్ లక్షణాలతో కొలిచిన ఎత్తు, జన్యుపరంగా అంచనా వేసిన ఎత్తు యొక్క అనుబంధాలను పరిశోధకులు పరిశీలించారు.