మనం పనిమీద బయటకు వెళ్లినప్పుడు పబ్లిక్ టాయిలెట్స్ వాడుతుంటాం. ఇప్పుడు చాలాచోట్ల వెస్టర్న్ టాయిలెట్లే ఉంటున్నాయి. వీటిని ఉపయోగించడం సాధారణంగానే మంచిదికాదు. కానీ, బయటకి వెళ్లినప్పుడు ఎమర్జెన్సీ టైంలో తప్పదు. అయితే, ఈ పబ్లిక్ వెస్టర్న్ టాయిలెట్స్పై చతికిలపడ్డట్లు కూర్చుంటే అనారోగ్య సమస్యలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల మూత్రనాళాల ఇన్ఫెక్షన్లు (యూటీఐ), సుఖవ్యాధులు వస్తాయని చెబుతున్నారు.
పబ్లిక్ టాయిలెట్ వాడడంవల్ల కలిగే అనారోగ్య సమస్యలు
టాయిలెట్ సీటునుంచి ఇన్ఫెక్షన్ లేదా వైరస్ సంక్రమించే ప్రమాదం చాలా తక్కువ. ఎందుకంటే ప్రమాదకర బ్యాక్టీరియా, వైరస్లు కొద్దికాలం మాత్రమే సజీవంగా ఉంటాయి. అయినా, ఇలాంటివాటినుంచి రక్షణపొందాలంటే టాయిలెట్ సీటుపై శానిటైజర్ చల్లడం లేదా టిష్యూతో తుడవడం చేయాలి. ఇంటినుంచి బయటకు వెళ్లేటప్పుడు వీటిని వెంట తీసుకెళ్లాలి.