Sperm Count Increasing Foods | సంతాన లేమి సమస్య ప్రస్తుతం చాలా మందిని కలవరపెడుతోంది. చాలా మంది దంపతులు సంతానం కోసం పరితపించిపోతున్నారు. పిల్లలు కలగడం లేదని వాపోతున్నారు. ఏం చేసినా కూడా సంతాన భాగ్యం పొందలేకపోతున్నామని విచారిస్తున్నారు. సంతాన లేమికి స్త్రీ, పురుషులు ఇద్దరూ లేదా ఇద్దరిలో ఎవరో ఒకరు కారణం అవుతారు. అయితే కొన్ని సందర్భాల్లో ఇద్దరిలో లోపం లేకపోయినా పిల్లలు కలగరు. అందుకు అనేక కారణాలు ఉంటాయి. పురుషుల విషయానికి వస్తే ప్రధానంగా వీర్యం నాణ్యంగా లేకపోవడం, శుక్ర కణాలు ఆరోగ్యంగా లేకపోవడం, కదలిక ఉండకపోవడం వంటివి కారణం అవుతాయి. అందుకనే ఫెర్టిలిటీ స్పెషలిస్టులు పురుషులను వీర్యం వృద్ధి చేసే ఆహారాలను తినాలని చెబుతుంటారు. ఇక ఆ ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
రోజుకో కోడిగుడ్డును తింటే ఆరోగ్యంగా ఉంటామని వైద్యులు చెబుతుంటారు. అయితే పురుషులు మాత్రం కచ్చితంగా రోజుకు ఒక ఉడకబెట్టిన కోడిగుడ్డును తినాల్సిందే. ఎందుకంటే గుడ్డులో విటమిన్ ఇ, ప్రోటీన్లు, కోలిన్ ఉంటాయి. ఇవి వీర్యం వృద్ధి చెందేలా చూస్తాయి. శుక్ర కణాల ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి. దీంతో సంతానం కలిగే అవకాశాలు మెరుగు పడతాయి. అలాగే రోజుకు ఒక క్యారెట్‌ను తింటున్నా కూడా ఉపయోగం ఉంటుంది. క్యారెట్లలో అనేక యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఎ ఉంటాయి. ఇవి స్పెర్మ్ కౌంట్ పెరిగేందుకు సహాయం చేస్తాయి. రోజూ 2 పచ్చి వెల్లుల్లి రెబ్బలను కాల్చి తింటుండాలి. స్పెర్మ్ కౌంట్‌ను పెంచడంలో ఇవి ఎంతగానో సహాయ పడతాయి. వెల్లుల్లిలో ఉండే ఆల్లిసిన్, సెలీనియం, విటమిన్ బి6 పురుషుల్లో శృంగార సామర్థ్యాన్ని సైతం పెంచుతాయి.
గుమ్మడికాయలను లేదా వాటి విత్తనాలను తరచూ తింటున్నా కూడా పురుషుల ఆరోగ్యం మెరుగు పడుతుంది. వీటిల్లో ఉండే విటమిన్ ఎ, యాంటీ ఆక్సిడెంట్లు, బీటా కెరోటిన్ పురుషుల ప్రత్యుత్పత్తి వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి. స్పెర్మ్ కౌంట్ పెరిగేలా చేస్తాయి. శుక్ర కణాల కదలిక సరిగ్గా ఉండేలా చూస్తాయి. దీంతోపాటు పాలకూరను కూడా ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇందులో విటమిన్ బి9, విటమిన్ సి ఉంటాయి. ఇవి వీర్యం అధికంగా ఉత్పత్తి అయ్యేలా చేస్తాయి. వాల్ నట్స్ ను రోజూ గుప్పెడు మోతాదులో నీటిలో నానబెట్టి తింటుండాలి. వీటిల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు, ఫోలేట్, విటమిన్ బి6, జింక్, సెలీనియం సమృద్ధిగా ఉంటాయి. అధ్యయనాలు చెబుతున్న ప్రకారం రోజూ వాల్ నట్స్‌ను పురుషులు తింటే స్పెర్మ్ కౌంట్ పెరగడమే కాదు, శుక్ర కణాలు బాగా యాక్టివ్‌గా మారుతాయి. సంతానం కలిగే అవకాశాలు పెరుగుతాయి.
డార్క్ చాక్లెట్లను కూడా పురుషులు తరచూ తింటుండాలి. వీటిలో ఎల్-ఆర్గైనైన్ అనే అమైనో యాసిడ్ ఉంటుంది. ఇది స్పెర్మ్ కౌంట్ పెరిగేందుకు సమాయం చేస్తుంది. శుక్ర కణాల్లో కదలిక సరిగ్గా ఉండేలా చూస్తుంది. ఫ్యాటీ ఫిష్ అయిన సాల్మన్, సార్డైన్స్, ట్యూనా వంటి చేపలను కూడా తరచూ ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇవి మన దగ్గర చాలా అరుదుగా లభిస్తాయి. కనుక వీటికి బదులుగా సముద్రపు చేపలను తినవచ్చు. వీటిల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉంటాయి. ఇవి స్పెర్మ్ కౌంట్ పెరిగేలా చేస్తాయి. పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాగే దానిమ్మ పండ్లు, నారింజ, స్ట్రాబెర్రీలు, అరటి పండ్లు, జామ పండ్లు, బాదంపప్పు, అవిసె గింజలు, నువ్వులు, నెయ్యి, చికెన్, మటన్ లివర్ వంటి ఆహారాలను తింటున్నా కూడా పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ పెరుగుతుంది. ఇవి శృంగార సామర్థ్యాన్ని పెంచేందుకు కూడా దోహదం చేస్తాయి. టెస్టోస్టిరాన్ ఉత్పత్తిని పెంచుతాయి. సంతానం కలిగే అవకాశాలను మెరుగు పరుస్తాయి.