హైదరాబాద్: సాధారణంగా చాలామంది ఆహారపు అలవాట్లలో పెరుగు ముఖ్యమైనదిగా మారిపోయింది. పెరుగును ఇష్టపడని వాళ్లు చాలా తక్కువగా ఉంటారు. ఎక్కువ మందికి ఆహారం చివరలో కొంతైనా పెరుగన్నం లేకపోతే భోజనం చేసినట్టే ఉండదు. ఇక కమ్మటి గడ్డ పెరుగు వేసుకుని తింటే ఆ మజానే వేరు. పెరుగుతో రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం సొంతమవుతాయి. మరి ఇంత ప్రాముఖ్యమున్న పెరుగును చలికాలంలో చాలామంది దూరం పెడుతారు.
చలికాలంలో పెరుగు తింటే జలుబు, దగ్గు లాంటి శ్వాసకోశ సమస్యలు వస్తాయని ఆందోళన చెందుతారు. అయితే, ఆరోగ్య నిపుణులు మాత్రం పెరుగుతో ఆరోగ్య సమస్యలు వస్తాయనేది ఒట్టి అపోహేనని చెబుతున్నారు. చలికాలంలో అయినా పెరుగు తినడంవల్ల ప్రయోజనమేతప్ప ఎలాంటి నష్టం లేదని స్పష్టంచేస్తున్నారు. మరి ఆ ఆరోగ్య ప్రయోజనాలేమిటో ఒకసారి తెలుసుకుందాం..
పెరుగుతో ఆరోగ్య ప్రయోజనాలు..
అస్తమా బాధితులు తస్మాత్ జాగ్రత్త..