తరతరాలకూ పొగ
ధూమపానం అత్యంత ప్రమాదకరమైన అలవాటు. ఇది వారి ఆరోగ్యానికే కాకుండా.. తర్వాతి తరం ఆరోగ్యానికి కూడా ‘పొగ’ బెడుతుంది. పిల్లల జీవక్రియ మీద తీవ్రమైన ప్రభావం చూపుతుంది.
ధూమపానం అత్యంత ప్రమాదకరమైన అలవాటు. ఇది వారి ఆరోగ్యానికే కాకుండా.. తర్వాతి తరం ఆరోగ్యానికి కూడా ‘పొగ’ బెడుతుంది. పిల్లల జీవక్రియ మీద తీవ్రమైన ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా, తండ్రి తీసుకునే నికోటిన్.. పిల్లల్లో మధుమేహం, కాలేయ సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, శాంటాక్రజ్ శాస్త్రవేత్తలు తాజాగా చేపట్టిన అధ్యయనం ఈ విషయాన్ని బయటపెట్టింది. నిజానికి గర్భిణుల ధూమపానం అలవాటు.. గర్భస్థ శిశువుల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని తెలిసిందే! కానీ, తండ్రి ఆరోగ్యం కూడా పుట్టబోయే బిడ్డపై అంతే ప్రభావాన్ని చూపుతుందని ఈ అధ్యయనం స్పష్టం చేస్తున్నది.
తండ్రి సిగరెట్ తాగడం వల్ల వారి పిల్లల శరీరంలో చక్కెరను ప్రాసెస్ చేసే విధానం మారిపోతుందని పరిశోధకులు చెబుతున్నారు. ఫలితంగా, రక్తంలో చక్కెర స్థాయులు అసమతుల్యంగా మారుతాయనీ, భవిష్యత్తులో టైప్-2 మధుమేహం వచ్చే ప్రమాదం పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు. ఇందుకు కారణాలను వివరిస్తూ.. పురుషుల శుక్రకణాల జన్యువుల మీద నికోటిన్ ప్రభావం చూపుతుందనీ, తద్వారా ఆ మార్పులు పిల్లలకు సంక్రమించి, వారి జీవక్రియను దెబ్బతీస్తాయని తాజా పరిశోధన తేల్చింది.
ఈ ప్రభావాలు మధుమేహంతోపాటు పిల్లల్లో కాలేయ పనితీరు మందగించడం, మెటబాలిక్ సిండ్రోమ్ వంటి సమస్యలకూ దారితీస్తుందని సదరు స్టడీ పేర్కొన్నది. తండ్రి ధూమపానం వల్ల లింగభేదం లేకుండా.. ఆడ, మగ పిల్లలిద్దరూ ప్రభావితమవుతారట. అయితే, వారిలో కనిపించే ఇన్సులిన్ స్థాయుల మార్పులు వేర్వేరుగా ఉండవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. కాబట్టి, సంతానం కోసం ప్లాన్ చేసుకునే పురుషులు.. కొన్ని నెలల ముందే ధూమపానాన్ని మానేయాలని సూచిస్తున్నారు. దానివల్ల పిల్లలకు ఇలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా కాపాడుకోవచ్చని చెబుతున్నారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RRR | రీజినల్ రింగ్ రోడ్ ఉత్తర భాగానికి కేంద్రం బ్రేక్.. ప్రస్తుత అలైన్మెంట్తో ప్రాజెక్టుకు ఆమోదం కష్టమే!
Congenital Birth: ఒడిశాలో రెండు తలలతో పుట్టిన మగ శిశువు
Mithun Chakraborty | ‘జైలర్ 2’లో రజనీకాంత్‌కు మిథున్ చక్రవర్తి కండీషన్.. విలన్ పాత్రకు ఓకే చెప్పడానికి అదే కారణమా?
Raja Saab | ‘రాజా సాబ్’ ఫ్లాప్‌కు అదే ప్రధాన కారణం.. తొలిసారి అసలు విషయం చెప్పిన నిర్మాత టీజీ విశ్వప్రసాద్!
Pope Leo XIV: పోప్ లియోకు ఊపిరితిత్తుల క్యాన్సర్.. సర్జరీతో కణితి తొలగింపు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

