Shankhapushpi Flowers | చూసేందుకు ఎంతో ఆకర్షణీయంగా నీలి రంగులో ఉండే ఈ పువ్వులను మీరు గమనించారా..? ఇవి మన చుట్టూ పరిసరాల్లోనే కనిపిస్తుంటాయి. శంఖపుష్పి అనే తీగ జాతికి చెందిన మొక్కకు ఈ పువ్వులు పూస్తాయి. ఈ పువ్వులు తెలుపు లేదా నీలి రంగులో ఉంటాయి. అయినప్పటికీ నీలి రంగు పువ్వులతోనే మనకు ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయని ఆయుర్వేదం చెబుతోంది. ఆయుర్వేదంలో పలు రకాల ఔషధాలను తయారు చేయడంతోపాటు పలు వ్యాధులను నయం చేసేందుకు శంఖపుష్పి మొక్కను ఉపయోగిస్తుంటారు. ఈ మొక్కకు చెందిన తీగ, వేర్లు, ఆకులు కూడా ఉపయోగకరమే. అయితే సాధారణంగా ఈ మొక్కకు పూసే నీలి రంగు పువ్వులనే అధికంగా ఉపయోగిస్తుంటారు. ఈ పువ్వుల్లో అనేక ఔషధ గుణాలు ఉంటాయి.
శంఖపుష్పి పువ్వులను వాడడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఏకాగ్రతగా పనిచేస్తారు. ఏదైనా అంశంపై ఎక్కువగా దృష్టి పెట్టగలుగుతారు. దీంతో ఆలోచనా శక్తి పెరుగుతుంది. పనిచేసే విషయాల్లో రాణిస్తారు. తెలివి తేటలు పెరుగుతాయి. మెదడు వికాసం చెంది యాక్టివ్‌గా పనిచేస్తారు. చురుగ్గా ఉంటారు. బద్దకం పోతుంది. ఎల్లప్పుడూ ఉత్సాహంగా కనిపిస్తారు. మానసిక శక్తి పెరుగుతుంది. మానసికంగా దృఢంగా, ఆరోగ్యంగా ఉంటారు. ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. డిప్రెషన్‌తో బాధపడుతున్నవారికి ఈ పువ్వులు చక్కని ఔధషంలా పనిచేస్తాయి. మానసికంగా ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటారు. శంఖపుష్పి మెదడుకు టానిక్‌లా పనిచేస్తుంది. మెదడు కణాలకు జరిగే నష్టం నివారించబడుతుంది. దీంతో వృద్ధాప్యంలో మతిమరుపు రాకుండా చూసుకోవచ్చు.
శంఖపుష్పి పువ్వులను వాడితే ఒత్తిడి, ఆందోళన తగ్గి మైండ్ రిలాక్స్ అవుతుంది. దీంతో నిద్ర చక్కగా పడుతుంది. రాత్రి పూట పడుకున్న వెంటనే గాఢ నిద్రలోకి జారుకుంటారు. నిద్రలేమి నుంచి బయట పడవచ్చు. మరుసటి రోజు ఉదయం ఉత్సాహంగా నిద్ర లేస్తారు. ఈ పువ్వుల్లో బయో యాక్టివ్ సమ్మేళనాలు అధికంగా ఉంటాయి. ఇవి ఫ్రీ ర్యాడికల్స్ బారి నుంచి శరీరాన్ని రక్షిస్తాయి. దీంతో గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా సురక్షితంగా ఉండవచ్చు. శంఖపుష్పి పువ్వుల్లో హైపో లిపిడెమిక్ గుణాలు ఉంటాయి. అందువల్ల ఈ పువ్వులను వాడితే శరీరంలోని కొలెస్ట్రాల్ కరిగిపోతుంది. రక్త నాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. రక్త సరఫరా మెరుగు పడుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
శంఖపుష్పి పువ్వుల్లో ఇమ్యునో మాడ్యులేటరీ గుణాలు ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. శరీరం వ్యాధులు, ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడేలా చేస్తాయి. శంఖపుష్పిని వాడడం వల్ల జీర్ణ శక్తి మెరుగు పడుతుంది. మలబద్దకం తగ్గుతుంది. ఇలా ఈ పువ్వులతో అనేక లాభాలను పొందవచ్చు. అయితే ఈ పువ్వులను ఎలా వాడాలంటే.. నాలుగైదు శంఖపుష్పి పువ్వులను తీసుకుని నీటిలో వేసి మరిగించి అనంతరం వడకట్టాలి. ఈ నీళ్లు గోరు వెచ్చగా ఉండగానే అందులో కాస్త నిమ్మరసం, తేనె కలిపి తాగేయాలి. ఈ విధంగా శంఖపుష్పి పువ్వులను వాడుతుంటే ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చు.