టోక్యో : మాంసాహార ప్రియులకు తాజా అధ్యయనం తీపికబురు అందించింది. చికెన్, పందిమాంసంలో పలు అనారోగ్యాలతో పోరాడే న్యూ యాంటీఆక్సిడెంట్లను జపాన్ పరిశోధకులు కనుగొన్నారు. మాంసం, చేపల్లో ఉండే ఇమిడజోల్ డిపెప్టైడ్స్ (ఐడీపీ) హై యాంటీఆక్సిడెంట్ యాక్టివిటీని కలిగిఉంటాయని ఒసాకా మెట్రపాలిటన్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ హిదేషి ఇహర నేతృత్వంలోని పరిశోధకుల బృందం తెలిపింది.
ఈ టీమ్ తొలిసారిగా ఈ మాంసాహారంలో 2-ఆక్సోఐడీపీలను గుర్తించింది. చికెన్, పందిమాసం తీసుకోవడం ద్వారా అలసటను అధిగమించడంతో పాటు డిమెన్షియాను నిరోధించవచ్చని పరిశోధకులు పేర్కొన్నారు.
ఈ పరిశోధన పద్ధతి ద్వారా వైద్యం, వ్యవసాయం, ఫార్మసీలోనూ మేలైన ఆవిష్కరణలతో పాటు వ్యాధుల నిరోధంతో ప్రజారోగ్యాన్ని కాపాడవచ్చని జర్నల్ యాంటీఆక్సిడెంట్స్లో ప్రచురితమైన అధ్యయన వివరాలు వెల్లడించాయి. బీఫ్, పోర్క్, చికెన్ సహా ఇతర యాంటీఆక్సిడెంట్లతో కూడిన మాంసాహారంలో ఐడీపీలతో పాటు భిన్నమైన 2-ఆక్సో-ఐడీపీలను పరిశోధనలలో తొలిసారి గుర్తించామని ప్రొఫెసర్ ఇహర పేర్కొన్నారు.