Health Tips | ఈ ఆహారం దూరం పెడితే మెరిసే చర్మం సొంతం
వయసు మీద పడటాన్ని ఎవరూ ఆపలేరు. అయితే వయసుతో పాటు వచ్చే చర్మంపై ముడతలు వంటి వృద్ధాప్య ఛాయలను (Health Tips) జాప్యం చేయవచ్చు.
న్యూఢిల్లీ : వయసు మీద పడటాన్ని ఎవరూ ఆపలేరు. అయితే వయసుతో పాటు వచ్చే చర్మంపై ముడతలు వంటి వృద్ధాప్య ఛాయలను (Health Tips) జాప్యం చేయవచ్చు. వయసు పెరుగుతున్న కొద్దీ వృద్ధాప్య ఛాయలు ముందుగా చర్మంపై కనిపిస్తాయి. చర్మంపై ముడతలను నివారిస్తూ మెరిసే చర్మాన్ని సొంతం చేసుకునేందుకు ఆహారం, వ్యాయామం ద్వారా ప్రయత్నిస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
యాంటీ ఏజింగ్ ప్రయోజనాల కోసం మనం ఎలాంటి ఆహారపదార్ధాలను తీసుకోవాలనే దానిపై ఫోకస్ పెట్టినా చర్మ సంరక్షణకు హాని కలిగించే ఆహార పదార్ధాలను దూరం పెట్టడాన్ని పెద్దగా పట్టించుకోం. ఇలాంటి ఆహార పదార్ధాలు తీసుకోవడం ద్వారా వేగంగా వయసు మీరడం, అసలు వయసు కంటే ఎక్కువ వయసు ఉన్నవారిలా కనిపించడం జరుగుతుంది. చాలా ఆహార పదార్ధాలు చర్మం త్వరగా వయసుమీరేలా చేస్తాయి. మనం తరచూ తీసుకునే ఆహార పదార్ధాలే మన చర్మాన్ని మసకబారేలా చేస్తుంటాయి.
ఇక అధికంగా చక్కెర తీసుకోవడం ముఖ్యంగా రిఫైన్డ్ షుగర్ వాడటం వలన వయసు మీరే ప్రక్రియ వేగవంతమవుతుంది. అందుక షుగర్స్ అధికంగా ఉన్న డెజెర్ట్స్ను తీసుకోవడం మానుకోవాలని ప్రముఖ న్యూట్రిషనిస్ట్ అంజలి ముఖర్జీ చెబుతున్నారు. ట్రాన్స్‌ఫ్యాట్స్ అధికంగా ఉండే వేపుళ్లు, జంక్ ఫుడ్ ఆరోగ్యంతో పాటు చర్మంపైనా ప్రభావం చూపుతాయి. అవి చెడు కొలెస్ట్రాల్ లెవెల్స్‌ను పెంచడమే కాకుండా వృద్ధాప్య ఛాయలకు దారితీసే ఇన్ఫ్లమేషన్ను ప్రేరేపిస్తాయి. ఇలాంటి ఆహారం చర్మంపై ప్రభావం చూపే డీహైడ్రేషన్‌కు కారణమవుతాయని ఫ్యాట్ లాస్ కోచ్ ఆయుష్ మాధుర్ చెబుతున్నారు. త్వరగా వృద్ధాప్య ఛాయలకు గురిచేసే ఆహార పదార్ధాలను పరిశీలిస్తే..
రిఫైన్డ్ షుగర్
ఫ్రైడ్ జంక్ ఫుడ్
అధికంగా మద్యం తీసుకోవడం
ప్రాసెస్డ్ మాంసం
కెఫీన్
Read More :
Nobel Prize | అర్థశాస్త్రంలో క్లాడియా గోల్డిన్‌కు నోబల్ పురస్కారం..
Read Today's Latest Health News in Telugu and Telugu News
- Tags
- agieng
- Food
- health tips
- Wrinkles
RELATED ARTICLES
తాజా వార్తలు
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

