న్యూఢిల్లీ : శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరిగించడంతో పాటు బరువు తగ్గడంపై (Weight Loss) చాలా మంది దృష్టి పెడుతుంటారు. ఆరోగ్యకరమైన ఆహారంతో పాటు గంటల కొద్దీ జిమ్‌ల్లో చెమటోడుస్తుంటారు. ఆహారం, వ్యాయామం బరువు తగ్గేందుకు కీలకమైనా ఎలాంటి ఆహారం బరువు తగ్గేందుకు తగినదనే ఎంపిక సంక్లిష్టంగా మారుతుంది.
చపాతీలు, రోటీలు, రైస్‌ను కూడా పక్కనపెట్టి కొందరు రకరకాల డైట్లు ఫాలో అవుతూ పలు రుగ్మతలకు లోనవుతుంటారు. అయితే ఎంతో ఇష్టమైన రోటీలను వదులుకోకుండా ప్రత్యామ్నాయ రోటీలతో బరువు తగ్గడంతో పాటు మెరుగైన ఆరోగ్య ప్రయోజనాలు దక్కించుకోవచ్చని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. వెయిట్ లాస్ డైట్లో భాగంగా మక్క రోటీగా పేరొందిన మొక్కజొన్న రోటీ ముందువరసలో నిలుస్తుంది.
గోధుమ పిండితో పోలిస్తే తక్కువ క్యాలరీలు ఉండే మొక్కజొన్నలో ఫైబర్ అధికంగా ఉంటుంది. పోషకాల గనిగా మక్కీ రోటీలో ప్రొటీన్, క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్, ఫాస్పరస్ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. మక్కీ రోటీతో కడుపు నిండిన భావన కలగడంతో పాటు మలబద్ధకాన్ని నివారించే ఫైబర్ ఇందులో అధికంగా ఉంటుంది. ఇక రోటీలకు ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తే..
మక్కీ రోటీ
రాగి రోటీ
సజ్జ రోటీ
మల్టీ గ్రైన్ రోటీ
జొన్న రోటీ
Read More :