వ్యాయామంతో మహమ్మారికి చెక్.. తగ్గనున్న కొవిడ్ మరణాల ముప్పు!
పలు ప్రాంతాల్లో కొవిడ్-19 కేసులు పెరుగుతున్న నేపధ్యంలో వైరల్ ముప్పు నుంచి తప్పించుకునే మార్గాలను తాజా అధ్యయనం వెల్లడించింది.
న్యూఢిల్లీ : పలు ప్రాంతాల్లో కొవిడ్-19 కేసులు పెరుగుతున్న నేపధ్యంలో వైరల్ ముప్పు నుంచి తప్పించుకునే మార్గాలను తాజా అధ్యయనం వెల్లడించింది. నిత్యం వ్యాయామం, శారీరక శ్రమ చేసే వారిలో కొవిడ్-19 సోకే ముప్పు తక్కువగా ఉందని, ఇన్ఫెక్షన్కు గురైనా తీవ్ర అనారోగ్యం బారినపడకుండా ఉండవచ్చని ఈ అద్యయనం స్పష్టం చేసింది. రోజుకు 20 నిమిషాల పాటు శారీరక శ్రమ, లేదా వ్యాయామం చేయడం ద్వారా వైరస్‌ను ఎదుర్కొనే క్రమంలో పలు ప్రయోజనాలు చేకూరుతాయని పరిశోధకులు గుర్తించారు.
శారీరక వ్యాయామం, చురుకుదనానికి కోవిడ్-19 ఇన్ఫెక్షన్కు మధ్య సంబంధంపై విస్తృతమైన డేటా ఆధారంగా పరిశోధకులు ఈ వివరాలను నిగ్గుతేల్చారు. రోజూ శారీరక శ్రమ, వ్యాయామం చేసే వారిలో కొవిడ్-19 ప్రతికూల ప్రభావాలు తక్కువగా ఉంటాయని బ్రిటిష్ జర్నల్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్‌లో ప్రచురితమైన అధ్యయనం తెలిపింది. వారానికి 50 నిమిషాల తేలికపాటి శ్రమతో కూడిన వ్యాయామం, లేదా 75 నిమిషాల కఠిన శారీరక శ్రమ లేదా వ్యాయామం చేయడం దీర్ఘకాల ప్రయోజనాలను అందిస్తుందని అధ్యయనం స్పష్టం చేసింది.
నవంబర్ 2019 నుంచి మార్చి 2022 మధ్య ప్రచురితమైన పలు సంబంధిత అధ్యయనాల డేటాబేస్‌ను మదింపు చేయడం ద్వారా పరిశోధకులు ఈ అవగాహనకు వచ్చారు. ఇక నిత్యం తగినంత శారీరక వ్యాయామం చేసే వారిలో కొవిడ్-19 సోకే అవకాశం 11 శాతం తక్కువ కాగా, తీవ్ర కొవిడ్ లక్షణాల బారినపడే ముప్పు 36 శాతం తక్కువగా, ఇన్ఫెక్షన్తో మరణించే ముప్పు 43 శాతం తక్కువని గణాంకాలు వెల్లడించాయి.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Feel Good | ‘ఫీల్ గుడ్’ చిత్రం నుంచి ‘మమ్మా మియా’ పాట విడుదల!
Probiotics | పండుగల వేళ జీర్ణ సమస్యలా? ఇంట్లోనే తయారు చేసుకోండి ఈ 4 ప్రోబయోటిక్ ఆహారాలు!
President Droupadi Murmu | ఒడిశాకు తుఫాన్ సూచన.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన వాయిదా
PV Sindhu | జపాన్ క్రీడాకారిణి హినా అకేచిపై విజయం.. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ చేరిన పీవీ సింధు
Bhargav Desh Pande | కాంగ్రెస్ పార్టీ అసలైన కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న కిరాయి నాయకులు : మాజీ NSUI స్టేట్ ప్రెసిడెంట్ భార్గవ్ దేశ్ పాండే
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

