న్యూఢిల్లీ : ఆరోగ్యానికి మేలు చేసే కోడిగుడ్లపై ఎన్నో అపోహలున్నాయి. అన్ని కాలాల్లో వాటిని తీసుకోరాదని, జీర్ణ సంబంధ సమస్యలు తలెత్తుతాయని (Health Tips) చెబుతుంటారు. అయితే ఏ కాలంలోనైనా గుడ్డును తీసుకోవచ్చని ఎగ్ శరీరానికి పోషకాలు అందించడంతో పాటు ఎలక్ట్రోలైట్స్‌ను సమతూకం చేయడంలో అద్భుతంగా పనిచేస్తుందన్నది పోషకాహార నిపుణుల మాట.
ప్రొటీన్ పవర్ హౌస్ వంటి గుడ్డును అపోహలతో పక్కనపెట్టడం తగదని చెబుతున్నారు. పోషకాల గనిగా పేరొందిన గుడ్డు శరీర ఆరోగ్యానికి, చురుకుదనానికి బాటలు వేస్తుంది. అయితే ఎగ్స్‌ను కూడా పరిమిత మోతాదులో తీసుకోవాలని, రోజుకు రెండు ఎగ్స్ తీసుకుంటే చాలని సూచిస్తున్నారు. ఎగ్స్‌లో విటమిన్ ఏ, బీ 6, బీ 12, విటమిన్ డీతో పాటు గుండెకు మేలు చేసే అసంతృప్త కొవ్వులు ఉంటాయి.
ఇక కంటి ఆరోగ్యానికి ఎగ్స్ ఎంతో ఉపకరిస్తాయి. వీటిలో లుటిన్, జెక్సాన్ధిన్ అనే యాంటీఆక్సిడెంట్లు క్యాటరాక్ట్స్ ముప్పును నివారిస్తాయి. ఇంకా కంటి చూపును మెరుగుపరిచి నేత్రాల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఎగ్స్‌ను వివిధ రూపాల్లో, వంటల్లో వాడటం ద్వారా లంచ్, బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్లలో భాగం చేసుకోవచ్చు.
Read More :
RoboChef | ఈ రోబోలు వంట చేస్తే లొట్టలేసుకుని తినాల్సిందే !