Raw Bananas | అరటి పండ్లు మనకు ఏడాది పొడవునా అన్ని సీజన్లలోనూ అందుబాటులో ఉంటాయి. ఈ పండ్ల ధర కూడా చాలా తక్కువగానే ఉంటుంది. కనుక అన్ని వర్గాల ప్రజలకు ఈ పండ్లు అందుబాటులో ఉంటాయి. ఇక అరటి పండ్లను తినడం వల్ల మనకు అనేక లాభాలు కలుగుతాయని చాలా మందికి తెలుసు. కానీ మీకు తెలుసా..? పచ్చి అరటికాయలను తినడం వల్ల కూడా అనేక లాభాలను పొందవచ్చు. అయితే ఈ కాయలను నేరుగా తినలేరు. కానీ వీటిని వంటల్లో వేసుకోవచ్చు. ఉడకబెట్టి తినవచ్చు. లేదా నీటిలో వేసి మరిగించి ఆ నీళ్లను తాగవచ్చు. పచ్చి అరటికాయలను తినడం వల్ల అనేక లాభాలు కలుగుతాయి. ఈ కాయల్లో మనకు అవసరమైన అనేక పోషకాలు ఉంటాయి. ఇవి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి.
పచ్చి అరటికాయలు ప్రీ బయోటిక్ ఆహారంగా పనిచేస్తాయి. అంటే వీటిని తింటే జీర్ణ వ్యవస్థలో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. ఇది మనం తిన్న ఆహారం సులభంగా జీర్ణం అయ్యేలా చేస్తుంది. దీంతో అజీర్తి తగ్గుతుంది. అలాగే ఆహారంలో ఉండే పోషకాలను శరీరం సరిగ్గా శోషించుకుంటుంది. దీంతో పోషకాహార లోపం తగ్గిపోతుంది. అలాగే రోగ నిరోధక వ్యవస్థ పటిష్టంగా మారుతుంది. ఈ కాయల్లో ఉండే ఫైబర్ వల్ల మలబద్దకం తగ్గడంతోపాటు ఇతర జీర్ణ సమస్యల నుంచి కూడా బయట పడవచ్చు. ఈ కాయల్లో రెసిస్టెంట్ స్టార్చ్ ఉంటుంది. పైగా వీటి గ్లైసీమిక్ ఇండెక్స్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. అందువల్ల వీటిని తింటే రక్తంలో చక్కెర స్థాయిలు నెమ్మదిగా పెరుగుతాయి. కనుక డయాబెటిస్ ఉన్నవారికి వీటిని చక్కని ఆహారంగా చెప్పవచ్చు. ఈ కాయలను తింటే షుగర్ లెవల్స్‌ను అదుపులో ఉంచుకోవచ్చు.
పచ్చి అరటి కాయల్లో అధికంగా ఉండే ఫైబర్, రెసిస్టెంట్ స్టార్చ్ కారణంగా ఈ కాయలను తింటే కడుపు నిండిన భావన కలుగుతుంది. ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. దీంతో ఆహారం తక్కువగా తింటారు. ఇది బరువు తగ్గేందుకు సహాయం చేస్తుంది. అధికంగా బరువు ఉన్నవారు రోజూ ఈ కాయలను తింటుంటే ఎంతగానో ఫలితం ఉంటుంది. శరీరంలోని కొవ్వు కరిగిపోతుంది. పొట్ట చుట్టూ ఉండే కొవ్వు కరిగి నాజూగ్గా తయారవుతారు. పచ్చి అరటి కాయల్లో పొటాషియం కూడా అధికంగానే ఉంటుంది. ఇది బీపీని నియంత్రించడంలో సహాయం చేస్తుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. దీంతో గుండె జబ్బులు, స్ట్రోక్స్ వచ్చే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయి. గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
ఈ కాయల్లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది రోగ నిరోధక వ్యవస్థను పటిష్టంగా మారుస్తుంది. దీంతోపాటు చర్మాన్ని సైతం ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈ కాయల్లో ఉండే విటమిన్ బి6 మెటబాలిజంను మెరుగు పరుస్తుంది. దీంతో క్యాలరీలు త్వరగా ఖర్చవుతాయి. కొవ్వు కరిధి అధిక బరువు తగ్గుతారు. అలాగే మెదడు ఆరోగ్యంగా, యాక్టివ్‌గా ఉంటుంది. ఉత్తేజంగా పనిచేస్తారు. చురుగ్గా ఉంటారు. వీటిల్లో ఉండే మెగ్నిషియం ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతుంది. కండరాలను దృఢంగా మారుస్తుంది. శరీరంలో శక్తి స్థాయిలను పెంచుతుంది. రాత్రి పూట నిద్రలో కాలి పిక్కలు పట్టుకుపోకుండా చూస్తుంది. అయితే పచ్చి అరటికాయలను నేరుగా తినలేరు. కానీ వీటిని కూరగాయగా వండుకుని తినవచ్చు. ఉడకబెట్టి తినవచ్చు. కొందరు చిప్స్ లేదా స్నాక్స్ రూపంలోనూ తింటారు. ఆరోగ్య ప్రయోజనాలు కలగాలంటే వీటిని కేవలం వండుకుని లేదా ఉడకబెట్టి మాత్రమే తినాలి.