కొందరిలో ‘నెలసరి’తోపాటు అనేక ఆరోగ్య సమస్యలూ పలకరిస్తాయి. హార్మోన్లలో మార్పులు, రక్తస్రావం, కడుపునొప్పి, నీరసం లాంటివి ఇబ్బంది పెడుతాయి. అలాంటి సమయంలో సరైన పోషకాహారం తీసుకోవాలి. అధిక శక్తినిచ్చే, రోగనిరోధకతను పెంచే పదార్థాలను ఎంచుకోవాలి. వివిధ రకాల పండ్లు.. ఈ విషయంలో ఎంతో సాయపడతాయి.