‘అల్సరే కదా!’ అని నిర్లక్ష్యం చేస్తే, అది ప్రాణాంతకం కావచ్చు. అన్ని అల్సర్లు ప్రమాదకరం కాకపోయినా.. కొన్నిమాత్రం క్యాన్సర్‌కు దారితీయవచ్చు. సాధారణంగా ‘అల్సర్’ అనేది ప్రతిఒక్కరికీ ఏదో ఒక దశలో ఎదురయ్యే సమస్య. నీరు తక్కువగా తాగడం, మానసిక ఒత్తిడి తదితర కారణాల వల్ల అల్సర్లు వస్తుంటాయి. ఇవి మూడునాలుగు రోజుల్లో తగ్గిపోతాయి. అలా కాకుండా ఎక్కువ రోజులు ఉండి బాధించే అల్సర్లను అనుమానించాల్సి ఉంటుంది.
తరచూ కనిపించే అల్సర్లు
నోటిపూత, పెప్టిక్ అల్సర్లు, గ్యాస్ట్రిక్ అల్సర్లు, ఈసోఫీగల్ (అన్నవాహిక) అల్సర్లు, కదలలేని స్థితిలో మంచానికే పరిమితమైనప్పుడు ఏర్పడే పుండ్లు, సిఫిలన్, హెర్పిస్ వంటి ఎస్టీడీ, ఈస్పీ, ఫంగల్ ఇన్ఫెక్షన్ల వల్ల మర్మావయవాలలో ఏర్పడే అల్సర్లు, డయాబెటిక్స్‌లో కాళ్లలో వచ్చే న్యూరోపతిక్ అల్సర్లు ఎక్కువగా కనిపిస్తుంటాయి.
క్యాన్సర్‌కు దారితీసే అల్సర్లుపెప్టిక్ అల్సర్లు
జీర్ణవ్యవస్థకు సంబంధించిన కొన్ని అల్సర్లు క్యాన్సర్లకు దారితీస్తాయి. వీటిలో ఎక్కువగా పెప్టిక్ అల్సర్లు వస్తుంటాయి. చిన్నపేగు మొదట్లో ఉండే ఈ అల్సర్లను‘డియోడినల్ అల్సర్లు’ అనికూడా అంటారు. ఇవి 1శాతం క్యాన్సర్‌గా మారే అవకాశం ఉంటుంది.
గ్యాస్ట్రిక్ అల్సర్లు
జీర్ణాశయంలో వచ్చే అల్సర్లను ‘గ్యాస్ట్రిక్ అల్సర్లు’ అంటారు. ఇవి పెప్టిక్ అల్సర్ల కంటే తక్కువగా కనిపించిన్పటికీ.. క్యాన్సర్‌గా మారే అవకాశాలు ఎక్కువ. హెలికోబ్యాక్టర్ పైలోరి అనే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల గ్యాస్ట్రిక్ అల్సర్లు వస్తాయి.
స్టమక్ అల్సర్లు
స్టమక్ క్యాన్సర్ వ్యాధులు గ్యాస్ట్రిక్ అల్సర్ల లక్షణాలను పోలి ఉంటాయి. దీర్ఘకాలంగా ఉన్న గ్యాస్ట్రిక్ అల్సర్లే స్టమక్ క్యాన్సర్లకు దారితీస్తాయి. అందుకని ఒకసారి అల్సర్ వచ్చి తగ్గిన తరువాత రెండోసారి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయవద్దు. వెంటనే వైద్యులను సంప్రదించి ఎండోస్కోపీ, బయాప్సీ పరీక్షలు చేయించుకోవాలి. అనుమానం ఉంటే సిటి-స్కాన్, అల్ట్రాసౌండ్ ఎండోస్కోపీ పరీక్షలూ చేయించుకోవాలి. దీనివల్ల క్యాన్సర్ ఏ దశలో ఉన్నదో తెలుస్తుంది.
అల్సర్లకు ప్రధాన కారణాలు
మసాలాతో కూడిన ఆహారం, కారం, మానసిక ఒత్తిడి, మద్యపానం తదితరాలే అల్సర్లకు ప్రధాన కారణంగా భావించేవారు. 1982లో టారీమార్షల్, రాబిన్ వారెన్ అనే ఇద్దరు వైద్యులు జీర్ణవ్యవస్థకు సంబంధించిన అల్సర్లపై పరిశోధనలు జరిపి, ‘హెలికోబ్యాక్టర్ పైలోరి’ అనే బ్యాక్టీరియా వల్ల అల్సర్లు వస్తాయనే విషయాన్ని కనుగొన్నారు. ఇందుకు వారికి నోబెల్ బహుమతి దక్కింది. ప్రపంచంలో 90శాతం మంది ఏదో ఒక దశలో ఈ బ్యాక్టీరియాకు గురవడం సహజం. కానీ ఒత్తిడి, ఎసిడిటీ, మద్యపానం, ధూమపానం వల్ల రోగి జీర్ణ
వ్యవస్థ లైనింగ్ దెబ్బతిన్నప్పుడు.. ఈ బ్యాక్టీరియా అల్సర్‌కు దారితీస్తుంది. పెయిన్ కిల్లర్లు అధికంగా వాడేవారు దీని బారిన పడే అవకాశం ఎక్కువ.
గ్యాస్ట్రిక్ అల్సర్ల ప్రధాన లక్షణాలు
చికిత్సా పద్ధతులు
ఏ క్యాన్సర్లకైనా ప్రారంభ దశలోనే సరైన చికిత్స తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. స్టమక్ క్యాన్సర్లు, గ్యాస్ట్రిక్ వంటి క్యాన్సర్లకు సంబంధించిన చికిత్స అనేది.. క్యాన్సర్ కారకం ఉన్న ప్రదేశం, వ్యాధి దశపై ఆధారపడి ఉంటుంది. పొట్టలో ప్రభావిత భాగాన్ని తొలగించి, గ్యాస్ట్రెక్టమీ, లింఫ్నాడ్స్, చిన్నపేగులో ఉన్న కొంత భాగాన్ని తొలగించాల్సి వస్తుంది. వ్యాధిని ఆలస్యంగా గుర్తించినప్పుడు పొట్ట మొత్తాన్నీ తీసివేసి, అన్నవాహికను చిన్నపేగుతో కలివేస్తారు. చివరి దశలో గుర్తించినప్పుడు లేజర్ థెరపీ, రేడియేషన్ థెరపీని అనుసరిస్తారు. క్యాన్సర్ కణితి పరిమాణామాన్ని తగ్గించి, పేగులలో స్టంట్‌ను అమరుస్తారు.
జాగ్రత్తలు
కడుపులో మంట, ఉబ్బరం, పుల్లటి తేన్పులు, అజీర్తి వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయవద్దు. ఎప్పుడో ఒకసారి ఈ లక్షణాలు కనిపిస్తే సమస్య లేదు. కానీ, తరచూ ఈ లక్షణాలు వెంటాడినప్పుడు యాంటాసిడ్‌ను వాడటం, తోచిన చిట్కాలు పాటించడం చాలా ప్రమాదకరం. అందుకని తరచూ పై లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. సరైన వైద్యుల ద్వారా చికిత్స పొందాలి.
డాక్టర్ మోహనవంశీ
చీఫ్ సర్జికల్ ఆంకాలజిస్ట్,
ఒమేగా హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్
98490 22121