తరచూ కోపం వస్తుందా? మీ ఆవేశం తగ్గాలంటే ఈ ఆహారం తినడం మంచిది
ఈ మధ్య కోపం పెరిగిపోతుందా? మీకు తెలియకుండానే ఇతరులపై అరిచేస్తున్నారా? తరచూ ఒత్తిడికి లోనవుతున్నారా? ఇలాంటి ఫీలింగ్స్‌కు కారణం డీహెచ్ఏ తగ్గిపోవడం కారణం కావచ్చు. ఇదే కారణమైతే సమస్య మరింత తీవ్రంగా మారొచ్చు. కోపం మరింత తీవ్రరూపం దాల్చవచ్చు. కాబట్టి జాగ్రత్తలు తీసుకోవడం అవసరం.
ఈ మధ్య కోపం పెరిగిపోతుందా? మీకు తెలియకుండానే ఇతరులపై అరిచేస్తున్నారా? తరచూ ఒత్తిడికి లోనవుతున్నారా? ఇలాంటి ఫీలింగ్స్‌కు కారణం డీహెచ్ఏ తగ్గిపోవడం కారణం కావచ్చు. ఇదే కారణమైతే సమస్య మరింత తీవ్రంగా మారొచ్చు. కోపం మరింత తీవ్రరూపం దాల్చవచ్చు. కాబట్టి జాగ్రత్తలు తీసుకోవడం అవసరం.

నిజంగానే డీహెచ్ఏ కారణంగా కోపం పెరుగుతుందా..?
DHA అనేది ఒమేగా -3 కొవ్వు ఆమ్లం, ఇది మీ మానసిక స్థితి, దూకుడు ధోరణులను నియంత్రించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మనలో కోపం పెరగడానికి, డీహెచ్ఏ ఎంతవరకు ప్రభావితం చేస్తుందో తెలుసుకోవడానికి ఇటీవల కొన్ని పరిశోధనలు జరిగాయి. ఈ పరిశోధనలో భాగంగా విద్యార్థులను రెండు విభాగాలుగా విభజించారు. వీరిలో ఒక విభాగం వారికి ఒమెగా -3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండే ప్లేసిబో లేదా ఫిష్ ఆయిల్‌ను సప్లిమెంట్‌గా అందించింది. మరో విభాగం వారికి డీహెచ్ఏ రెజిమెంట్ అందించింది. ఆ తర్వాత వారి ప్రవర్తనలను గమనించగా.. ప్లేసిబో తీసుకోని విద్యార్థులు కాస్త దూకుడుగా కనిపించారు. అయితే ఒత్తిడితో కోపం పెరగడంలో డీహెచ్ఏ నేరుగా కారణం కాదు. కానీ శరీరంలో ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ తగ్గడం వల్ల ప్రేరణ నియంత్రణ, కోపంతో అనుసంధానించబడ్డ న్యూరో ట్రాన్స్మిటర్లను తారుమారు చేస్తుంది.
ఎలాంటి ఆహారం తీసుకోవడం మంచిది?
ఒమెగా-3 ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల డీహెచ్ఏను పొందవచ్చు. అంటే మీరు తినే ఆహారంలో చేపలు, సీఫుడ్లతో సహా ఫిష్ ఆయిల్ సప్లిమెంట్లను తీసుకోవడం ద్వారా మీరు ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలను పొందవచ్చు. అంటే ప్రత్యేకంగా, సాల్మన్, ట్యూనా, మాకేరెల్ లేదా సార్డినెస్ వంటి కొవ్వు చేపలను ఎంచుకోండి. చేపలు ఇష్టపడని వారు గుల్లలు(oysters), మస్సెల్స్(massels) నుంచి ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పొందవచ్చు. ఇది మీ కోపం, ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడటమే కాకుండా, నిరాశ నుంచి బయటకు రావడంలో, మీ మెదడును చురుగ్గా మార్చడంలో సహాయపడుతుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
ఒత్తిడి తగ్గితే శిరోజాలకు శుభవార్తే!
ఆయనకు ఆ కోరిక ఎక్కువ.. నేనేం చేయాలి?
వర్షాకాలంలో ఈ కాయలు తప్పనిసరిగా తినాలి..! ఎందుకంటే..?
బరువు తగ్గాలా..? ఈ చిట్కాలు పాటించండి..!
పనిలో పడి శృంగారానికి దూరమవుతున్నారా.. ప్రమాదమేనట!
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

