ఒత్తిడి తగ్గితే శిరోజాలకు శుభవార్తే!

మనిషికి జుట్టంటే మహాప్రేమ. ఆ నాలుగు వెంట్రుకలూ రాలిపోవడమో, తెల్లబడటమో జరిగితే చాలు న్యూనత మొదలవుతుంది. మన జుట్టు గురించి పాలవాడు, పొరుగువాడూ వినిపించే సానుభూతి వాక్యాలు ఆ బాధమీద ఉప్పూకారం చల్లుతాయి. ఇవన్నీ ఇప్పటిలో తీరే సమస్యలు కాకపోయినా, జుట్టుగురించి ఓ ఆశ్చర్యకరమైన పరిశోధన వెలుగుచూసింది. కేవలం ఒత్తిడివల్లే జుట్టు తెల్లబడితే మాత్రం ఆ రంగును మార్చవచ్చని చెబుతున్నారు పరిశోధకులు. ఇందుకోసం వాళ్లు కొంతమంది విద్యార్థులను ఎంచుకున్నారు. వారివారి ఒత్తిడి స్థాయిని రోజూ నమోదు చేయమని చెప్పారు. ఒత్తిడి ఎక్కువగా ఉన్నవారిలో జుట్టు తెల్లబడే అవకాశాలూ ఎక్కువగానే ఉన్నాయని, కొద్దిరోజులు వాళ్లు సెలవులో విశ్రాంతి తీసుకొన్నప్పుడు ఒత్తిడి తగ్గి జుట్టు మళ్లీ నల్లబడిందనీ ఆ శాస్త్రవేత్తలు గ్రహించారు. ఇది జుట్టు విషయంలో మాత్రమే శుభవార్త కాదు, శరీరంలో శాశ్వతం అనుకునే కొన్ని మార్పులను, మళ్లీ వెనక్కి మళ్లించే అవకాశం ఉందనడానికీ ఒక శుభ సూచన.
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
- Tags
- Health news
- health tips
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
Rains | బంగాళాఖాతంలో అల్ప పీడనం.. మూడు రోజులు వర్షాలు..!
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్బీర్!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

