Omicron symptoms |ఒమిక్రాన్ సోకిందో లేదో ఇలా తెలుసుకోండి

Omicron symptoms | కొద్దిరోజులుగా భారత్‌లో కొవిడ్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. రోజువారీ కేసుల సంఖ్య రెండు లక్షలకు చేరువయ్యాయి. ఒమిక్రాన్ వేరియంట్ కేసులు కూడా బాగానే వస్తున్నాయి. రెండేండ్ల నుంచి కరోనా వైరస్‌ను చూస్తున్నాం కాబట్టి దీని లక్షణాలపై అవగాహన వచ్చేసింది. కానీ కొత్తగా వచ్చిన ఒమిక్రాన్ వేరియంట్ లక్షణాలు ఎలా ఉంటాయనేది ఇప్పటికీ ఇంకా పూర్తిస్థాయిలో స్పష్టత రాలేదు. మిగిలిన వేరియంట్లతో పోలిస్తే ఒమిక్రాన్ లక్షణాలు భిన్నంగా ఉంటాయని మాత్రం అర్థమైంది. ఈ క్రమంలోనే అసలు ఒమిక్రాన్ లక్షణాలు ఎలా ఉంటాయనే దానిపై ప్రముఖ పల్మనాలజిస్ట్ డాక్టర్ సోనమ్ సోలంకి వివరణ ఇచ్చింది. ఆమె చెప్పిన దాని ప్రకారం…
ఒమిక్రాన్ లక్షణాలు ముందుగా ఒళ్లు నొప్పులతో మొదలవుతాయి. నీరసంగా ఉంటుంది. అలసటతో పాటు తలనొప్పి, జ్వరం వంటి సమస్యలు వేధిస్తాయి. విపరీతమైన దగ్గు వస్తుంది. జలుబు, ముక్కు నుంచి నీరు కారడం ఎక్కువగా ఉంటుంది. అయితే కొద్ది రోజుల్లోనే దగ్గు తగ్గిపోతుంది. 80 శాతం మందిలో జ్వరం తగ్గడానికి మూడు రోజుల సమయం పడుతుంది. ఒకవేళ మూడు రోజుల తర్వాత కూడా జ్వరం తగ్గకపోతే ఇన్ఫెక్షన్ ఎక్కువయినట్లే. అలాంటప్పుడు ఆస్పత్రిలో చేరాల్సిన అవసరం ఉంటుంది. అని డాక్టర్ సోనమ్ సోలంకి వెల్లడించారు.
ఒమిక్రాన్ సోకిన వారిలో కరోనా ప్రధాన లక్షణాలతో పాటు ఇతర లక్షణాలు కూడా కనిపిస్తున్నాయని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ( సీడీసీ ) ఇటీవల వెల్లడించింది. జ్వరం, దగ్గుతో పాటు చర్మం, గోర్లు, పెదవుల రంగులో మార్పు వస్తుందని తెలిపింది. ఇదిలా ఉంటే.. చర్మంపై దద్దుర్లు, అసాధారణ దురద కూడా ఒమిక్రాన్ లక్షణమేనని యూకే వైద్యనిపుణులు చెబుతున్నారు. జెడ్ ఓఈ యాప్ ద్వారా 3.36 లక్షల మంది డేటాను విశ్లేషించిన.. లండన్ కింగ్స్ కాలేజి శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని వెల్లడించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
ఒకటి కంటే ఎక్కువ బూస్టర్ డోసులు వేసుకొవచ్చా? తీసుకుంటే ఏమవుతుంది?
Omicron variant symptoms | గొంతులోనే వైరస్.. ఒమిక్రాన్ వేరియంట్ లక్షణాలివే..
కరోనా గత వేరియంట్లతో ఊపిరి ఆడకపోయేది.. ఒమిక్రాన్‌లో ఈ లక్షణం ఎందుకు లేదు?
ఒమిక్రాన్ ఎందుకు వేగంగా వ్యాపిస్తోందంటే?.. మూడు కారణాలు చెప్పిన WHO శాస్త్రవేత్త
ఒమిక్రాన్ వచ్చింది మన మంచికేనా?.. అధ్యయనాలు ఏం చెబుతున్నాయి?
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

